పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
217 పదునాల్గవ ప్రకరణము


యడిగినను తడవు కోకుండ లేదని చెప్పునుగాని యాతనికిఁ గొంచెము రోగము వచ్చినప్పుడుమాత్ర మాతని చర్యవలన మూఢూలకుండ దాని కంటే నెక్కువభయము కలిగియుండుటను గనిపెట్టవచ్చును.నేనట్లు యేగివేషము వేసికొనియున్న కాలము నితరులే యేగిని ప్రశంసించి నను,నేనాతఁడెంతవాఁడని తృణీకరించుందును.సాధారణముగా యేగ్యులు తాము కీర్తిని బొందవలెనని కోరుచుండఁగా అయే గ్యులు వారికీర్తిని పాడుచేసి తమకీర్తితో సమానమైనదానినిగాఁ జేయఁ జూచుచుందరుగదా? నేనిట్లనేక వేషములు వేసి కడపట బైరాగినై వీరినిద్దఱిని శిష్యులనుగాఁ గైకొని చిదానందయేగియను పేర ధవళేశ్వరము ప్రవేశించి, యీ రాజశేఖరుఁడుగారినే స్వర్ణము చేసి యిచ్చెద నని మాయచేసి యిప్పుడుతమయేదకు ఁదెచ్చిన నగలనే యపహరించుకొని పోతిని,అక్కడనుండి పోయినపిమ్మట గడ్డమును మీసమును గొఱిగించుకొని నీలాద్రిరాజు నయి పిఠాపురము ప్రవే శించి, వీండ్రసాయము చేతనే రాజుగారి ధనాగారములోని ధనమును తరలించితిని. ఈరెండుచోట్లను నేను జరిగించిన యద్భుతచర్యలును నానటనమును రాజశేఖరుఁడుగారును కొమారుఁడును చక్కగాఁ చెప్పఁగలరు.కనుకను, ఆత్మప్రశంస యనుచిత మగుటచేతను,ఇంత టితోఁ జాలించు చున్నాను. అని యూరకుండెను.

కృష్టజగపతి మహారాజులుగా రాతనిచరిత్రము విన్నతరువాతను నిమిష మాలోచించి,పద్మనాభునివంకఁ దిరిగి నీవిప్పుడు బుద్ధితెచ్చు కొని నిజముగాఁబశ్ఛాత్తప్త్తుఁడ వైనాఁడవు గనుక నినొక్కసంవ త్సరము కారాగృహమునందు బెట్టింప నిశ్చయించినా మని చెప్పి , కారాగృహాధికారి కట్టియు త్తరువును వ్రాసి యాతనిని రాజభటుల వెంబడి చామర్లకోటకుఁ బంపివేసిరి. తరువాత పిఠాపురపువారి ధనము