పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

211 పదునాల్గవ ప్రకరణము

నంతటి బుద్ధిమంతుఁడు లేఁడని చెప్పుచుండును. చిన్నప్పటినుండియు నేను నిజముగా సూక్ష్మబుద్ధికలవాఁడను నేర్పుకలవాఁడను ఆవుదును. నా నేరుపరితనమువలన మావారి కెప్పుడును నష్టమేకాని చిల్లిగవ్వ యైనను లాభముకలుగకపోయినను నాజననీజనకులు నన్ను నేరుపరిని గానేయెంచి సంతోషించుచుండిరి.ఏలయనిన,నేను నానేరుపంతయు నితరులను మోసముచేయుటయందే యుపయోగించుచు వచ్చితిని. నేను మోసములను నేర్చుకొనుటలో నిచ్చినశ్రద్ధలో సగమైనను ఏదో యొకవృత్తిని నేర్చుకొనుటలో నిచ్చియుంటినేని, నేనీపాటి యెంతో భాగ్యవంతుడనై యుందును. ఆసంగతి నట్లుండనిండు.నాకు బడి పెత్తనము వచ్చుటచేత పంతులతో చాడిచెప్పి కొట్టించెద ననిపిల్లలను బెదరించి తినుబడిపదార్దములను లంచముపుచ్చుకొనుచుందును.ఇట్ల్లుం డఁగా నాదురదృష్టవశమున ఆపంతులు కాలముచేసెను.ఆకాలములో పంతులెంతవిస్త్థారముగా దెబ్బలుకొట్టుచున్న నంతగట్టిగాఁ డనిపించు కొనుచుండును గనుక చదువుకొన్నపంతు లదివఱకే మాయూర బడి పెట్టుకొనియున్నను,అఁతడు పిల్లలయందు ప్రేమగలవాఁడై నిష్కారణ ముగా కొట్టుటకు పాలుపడనందున,పిల్లలనెవ్వరున్నతనిబడికిఁ బంప కుండిరి.ఇప్పుడు గ్రామములో రెండవపంతులు లేనందున,మాబడి లోని పిల్లలనందఱను విధిలేక యక్కడకే పంపవలసివచ్చెను.ఈకొత్త పంతులవద్ద మునుపటివలె నాయాటలేమియు సాగినవికావు.ఇంతలో మాతండ్రియు నాకస్మికముగా గుండెలో నొప్పివచ్చి లోకాంతర గతుఁడయ్యెను. ఆతఁడు తనధనము నెక్కడనో పాతిపెట్టి మరల కాలమునందెవ్వరితోను చెప్పకయే కాలముచేసినందున పెద్దమ్మ వారు మమ్ము మఱింత శీఘృముగా వచ్చియాశ్రయించెను.ధనికుఁ డైన మా పొరుగువారి పిల్లవాఁడొకఁడు మా బడిలోనే చదువుకొను