- రాజశేఖర చరిత్రము
కనఁబడి యులికి పడుచుందును. అంతేకాక నాకిప్పుడు వారర్ధికమువచ్చి యున్నది. కాఁబట్టి చిరకాలము బ్రతుకఁబోను. ఆ సంగతిని తలఁచు కొను నపుడెల్ల నాకు యమభటులవలన భయముచేత దేహము కంప మెత్తుచున్నది. రాజదండనను పొందినవారికి యమదండనలేదని పెద్దలు చెప్పుదురు.కాఁబట్టి నేను చేసిన పాపమునకు మీవలన శిక్షను బొంది సుఖంపఁగోరుచున్నాను.
కృష్ణ---నీచరిత్రమంత యద్భుతమయిన దయ్యెనేని, ససాకల్య ముగా వినిపింపుము.ఇచ్చట నున్నవారంఱును విని యానందించెదరు. నీలా---నాజన్మస్థానము కాళహ స్తి. నా తల్లిదండ్రులంతగా ధనవంతులు కాకపోయినను శూద్రకులములలో మిక్కిలి గౌరవమును కాంచిన వంశమునందుఁ బుట్టినవారు.నాతల్లిదండ్రులకు నేనొక్కఁడనే పుత్రుఁడను గనక నన్ను వారు మిక్కిలిగారాబముతోఁ బెంచుచుం డిరి.నేనేదికావలెనన్నను తత్క్షణము తెచ్చిపెట్టుచుండిరి.అయిదేండ్లు వచ్చినతరువాత న న్నొకన్నాఁడు చదువవేసి,పంతులకు దోపతుల చావును గట్టఁబెట్టిరి.ఆ పంతులేవిధమునను దనకు జీవనము జరగనం దున పీనుగులమోయు వ్యాపారమునఁ బ్రవేశించి ముసలివాఁ డయి తాను చిన్నప్పుడైనను చదువుకొన్నవాఁడు కాకపోయినను తుదకు చదువులబడిని జీవనోపాధిగా నేర్పఱుచుకొని మాగ్రామమును జేరెను ఆఁతడుచెప్పెడు చదువొక్కముక్కయైననులేకపొయినను గొట్టెడిదెబ్బలు మాత్ర మక్షరలక్షగా నుండెను. ఆయిన నాతఁడు ధనమిచ్చిన వారి యెడ మిక్కిలి ప్రేమ గలవాఁడు గనుక నాతల్లిదండ్రులు చిఱుతిండి నిమిత్తమయి నాకిచ్చెడిసొమ్ములో సగము పంతులకిచ్చి దెబ్బలు తప్పించుకొంటిని.అందుచేత పంతులు నామీఁద నత్యంత ప్రేమగల వాడై నాకు బడి పెత్తనమిచ్చి, నాతల్లిదండ్రులతో మీకొమారు