పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ృ:రాజశేఖర చరిత్రము

రాజ---- వెనుక మీరాయనను చదువు రాదని చెప్పినారే, ఆయన శిష్యుల కేమి యుపదేశము చేయును?
వైష్ణ---- ఆయన కెంతచదువు వచ్చునో నాకు సంతేవచ్చేను. శిష్యులకుపదేశించుట కేమి చదువు రావలెను? శిష్యుల కష్టాక్షరి చెవిలో నుపదేశించి నిత్యమును నస్టోత్తరశతము జపము చేసికొమ్మని చెప్పి, గురువే దైవమని నమ్మి కొలిచిన వైకుంఠము కరస్థ మని పలికి, బుజములమీఁద తప్తముద్రధారణము చేసి,మా గురుదక్షిణ పుచ్చుకొని మాదారిని మేము పోదుము. మే మెవ్వరితోను ప్రసంగించము గనుక మమ్మందరును పండితులే యనుకొదురు.
రాజ---- మీ రీగ్రామములో పదిదినములుందురా?
వైష్ణ---- ఉండము. రేపే వెళ్ళిపోయెదము. తరువాత సావకాశముగా దర్శనముచేసి మాటాడెదను.
అని యాతఁడు పల్లకీతోఁగలిసికొనుట కయి పరుగెత్తెను.
వారు వెళ్ళినతరువాత వీధితలుపు వేసివచ్చి మగవారు రాత్రి భోజనమునకుఁ గూరుచున్నతోడనే యెవ్వరో వచ్చి వీధితలుపుకడ "రాజశేఖరుడు మామగారూ " అని పిలువజొచ్చిరి. మాణిక్యాంబ నడవలోనికి వెళ్ళి 'యెవరువార ' ని యడుగఁగా 'నేను నృసింహస్వామి ' నని వెలుపలినుండి యొకరు పలికిరి. ఆ మాటయొక్కధ్వనియు పేరును విన్నతోడనే మాణిక్యాంబ భయపడి తటాలున లోపలికిఁ బరుగెత్తుకొని వచ్చి యాసంగతి భర్తతోఁజెప్పి ' నృసింహస్వామి పోయి అన్నాళ్ళయినది; ఎప్పుడును నాకీవరకు స్వప్నములోనినను గనఁ బడలేదు.ఇప్పు డీవిరుద్ధమే ' మని యాశ్చర్యపడఁ జొచ్చెను. ఇంతలో వీధితలుపువద్ద మరల గేకలువినఁబడెను.అప్పుడు రాజశేఖరుఁడు గారు భోజనముచేసి దీపము వెలిగించుకొని పోయి తలుపుతీసిరి,తీయఁగా నిజముగా నృసింహస్వామియే 'మామా' ' యని పలుకరించి,