Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పండ్రెండవప్రకరణము


మొగము పోలికయు కంఠస్వరమును రామరాజు వానివలె నన్నుందున, రాజశేఖరుండు గారు దేహమంతయు జెమర్ప దిగ్భమము నొంది యూరక తెల్లపొయి చుచుండెను. అప్పుడు రాజుగారాయన వెలవెలవాటు నుతత్తరమును గని పెట్టి సింహాసనము నుండి దిగివచ్చి చేయిపట్టుకొని, వెనుక రామరాజును వేరున బలుమారువచ్చి యోగక్షెమంబుల నారయుచువచ్చినది తామేయనియు, వెంటనె సహాయముచేయుటకు శక్తికలిగియుండియు బ్రవర్తమును బరిక్షించుటకయి యింతకాలముపేక్ష చేసితిమనియు, చెప్పి వెంటనే కారాబంధ విమోచనము చేయించిరి. రాజశేఖరుండుగారు కొంతసేవేమి పలుకుటకును తోచక కోంత భయము తీఱిన వెనుకమెల్లగ వెలుగుతెచ్చుకొని. హగ్దదస్వరముతో" దేవర పరిస్తితి తెలియక సామన్యమానవునిగా నెంచియ గౌరవముతో జూచినందనకును సీత వివాహకార్యమునకు భంగముకలిగెనన్న కోపమున దూషణవాక్యములు పలికినందునకును క్షమించిరక్షింప వలయునని బహుదీనత్వముతో వేండుకొనిరి. ఆవిషయమున దమకెప్పుడు మనసులో మఱియొక లాగున లేదనిచెప్పి, రేపు పెద్దాపురమునకు వచ్చి తమ్ముజూడవలసినదని సెలవిచ్చి రాజుగారాయన నింటికి బంపిరి..

ఆయన వెళ్ళిన తరువాత రాజుగారు శోభనాద్రిరాజును బిలిచి యాతండు చేసిన నేరమున కెంతగొప్పదండనము విధింపవలసియున్నను దయారసముపెంపున నెల దినములు మాత్రము చెఱసాలలో నుండ శిక్ష విధించి భటులవశముననొప్పగించిరి. అంతేకాక సీతనెత్తుకు పొయినవారిని తాను పట్టి తెప్పించినప్పుడు నిజముచెప్పిన యెడల శిక్షలో గొంతభాగము తగ్గింపబడునని వాగ్దానముచేసి యుండుటంబట్టి వాండ్ర శిక్షలో సగముతగ్గించుటయే కాక మంచి రాజుపాపయ్యకు