- పండ్రెండవప్రకరణము
రాజశేఖరుండుగారేమో విన్నపము వ్రాసినందునకయి పిలుచుకొని రమ్మనరని చెప్పి, ఆయనను వెంటబెట్టుకొని పోయెను, ఆయన వెళ్ళునప్పటికి సమస్తాభరణభూషితులయి రాజుగారు రత్నసింహాసనముమింద గూరుచుండి యుండగా, వేత్రహస్తులు పసిడిబెత్తములను చేతంబూని ముందు నిలుచుండిరి. చామరధరులిద్దఱు ప్రక్కల నిలుచుండి వింజామరలు వీచుచుండిరి; భటులాయుధపాణులై పార్శ్వములను నిలుచుండిరి; ఒకప్రక్కను శోభనాద్రిరాజు చేతులు జోడించు కొని నిలుచుండెను రెండవప్రక్కను మఱియిద్దఱు మనుష్యులు చేతులుకట్టుకొని నిలువబడి యిండిరి రాజశేఖరుడుగారు వచ్చిమొదట నిలువబడగానే క్రిష్ణజగపతిగారు మిరీశోభనాద్రిరాజుగారి మీద నేమైన మాపేర మనవి చేసూకోన్నార? అనియడిగీరి. రాశేఖరుండుగారు తనమిదికేమివచ్చునోయని భయపడుచు, శరీరమంతయు కంపము నొంద నోరుమెదల్పక యూరకుండిరి.
కృష్ణ--శోభనాద్రిరాజా; నీవీరాజశేఖరుండుగారి విషమయి చేసిన యక్రమవు పనులన్నియు మాకు దెలియవచ్చినవి. నీకు చనపరిగానున్నతుచ్చునకు తనకొమార్తె నియ్యనన్న మాత్రమున, నీవాయనను పట్టిచెఱసాలలో నున్నవాండ్ర నిద్దఱను విడిచిపుచ్చి యాచిన్నదానినెత్తుకొని పోవునట్లు ప్రేరేపించితివి.
శోభ--ఆచిన్నదాని నెవ్వరెత్తుకొని పోయినారో నాకేమియు దెలియుదు.
కృష్ణ--నీకు దెలియక పోయిన యెడల జెఱసాలలొ నున్న వీండ్రిద్దఱును నెట్లు వెలుపలికి వెళ్ళగలిగిరి?
శోభ--వీండ్రిద్దరు నిన్నటి యుదయ కాలమున గోటదాటి పాఱి పోయినారు.