- పండ్రెండవప్రకరణము
పాప--ఎమి యుపకారము? ఈదుర్మార్గుని మూలమున చెఱసాలలో బడిబాధపడుచున్నాను రాజుగారెప్పుడో యీతనిదుర్మార్గతను దెలిసికొని యీతనిని కూడ మాకు సహయునిగా నిందేయుంతురు, ఆటుపిమ్మట మఱియొక కారాగ్రహాధికారి వచ్చినప్పుడు మాపాట్లు దైవమునకు దెలియుగలవు.
రాజ--మికొమారునకు పిల్లనియ్య నందునకే సుమి నన్నితడిందు బెట్టించి నాడు.
పాప--ఆవును నేనెఱుగుదును. మిఱు రాజుదగ్గఱ నుండంగా పద్మరాజును పిలిపించి నప్పుడు వాడు నావద్దననే యున్నాడు. ఆదియంతయు నేనును మావాడు నావద్దనేయున్నాడు. ఆదియంతయు నేనునుమావాడును రాజును సిద్దాంతియు గలసిచేసిన యాలోచనయే అయినను మీదినములు బాగుండి మాయాలోచన కొనసాగినది కాదు. శోభనాద్రి రాజేక్కడికోగాని నాతో గూడనల్ల చెఱువు వద్దనుండిన. వాండ్ర నిద్దఱిని, సంకిళ్ళూడ దీయించి పంప దలంచు కొన్నాడు.
రాజా--ఎక్కడికో మికూతెలియలేదా?
పాప--తెలియలేదు. ప్రొద్దున నాతతోనేమో యాలోచించుటకు వచ్చినప్పుడు రాజుగారితమ్ముండిక్కడకువచ్చి నందున రాత్రి చెప్పెదనని వెళ్ళిబోయినాడు. నేను మీకుగొప్ప యుపకారము చేసితిని; దానికి మాఱుగా నిప్పుడుపకారము నొకదానిని జేసెదను. పెద్దాపుర రాజుగారు బహుయోగ్యులు; శోభనాద్రిరాజు మిమ్మిట్లు నిర్బంధపెట్టుచున్న మనవి వ్రాసికొన్న యెడల మిమ్ముతక్షణమే విడుదలచెయుదురు. కాగితము మొదలైనవి నేనుతెపించియిచ్చెదను.