పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖరచరిత్ర

పంపెను. వెనుక కోయరామిరెడ్డియు వానిమనుష్యులును పట్టుకోబడి రాజుగారిచే చెట్లు కొమ్మలకు ఊరితీయబడిన తరువాత మేము ప్రబలులముగా నుండి రెండు మానములు త్రోవలు కొట్టుటతో బ్రసిద్దిగాంచితిమి. దోచుకొని తెచ్చిన సోమ్ములో సగము శోభనాద్రిరాజు పుచ్చుకొనుచుండెను. మిగిలిన సగములోన సగము నావంతునకు వచ్చుచుండెను మెట్టుసొమ్ములో నాలవపాలును తక్కినవారును నలువురును సమభాగములుగా బంచుకొనుచుండిరి. నేను యోగివలె నటింపుచుందును: నాతోడనున్న వారు దూరముగా నడవిలో బగలెల్లనుండి రాత్రులువచ్చి మాటాడి పోవుచుందురు: గుడెసె లోపగలు వారికేమయిన వర్తమానము చేయవలసివచ్చినప్పుడు, గుడెసెలో గాపురమున్న కోయవానిని బంపుచుందును; వానికి ప్రత్యేకముగా నేనేజీతమిచ్చెడి వాడను.

రాజ--ఆప్పుడు విల్లును ఆమ్ములును బుచ్చుకొని మాతో వచ్చిన వాండు వాడేకాడా?

పాప--నాబావ పొట్టవాడే. మినిమిత్తమై పంపినాటి రాత్రియే యానలుగురిలో నొకడుచంపబడి నాడు. రాజుగారికేలాగున దెలిసెనో కాని మఱునాడు తెల్లవారక మునుపే రాజభటులుకోయవానిని కోట్టినందున వాడుతక్కినవారుండు స్తలములనుజూపగా వారిని సహితము పట్టుకొని మమ్మందఱను రాజుగారియొద్దకుతీసుకొనివచ్చిరి. ఆయన మమ్మందఱను చెఱసాల యందుబెట్టించెను; మాకందఱకు శిక్షకలిగినను మేమిరాజుపేరుచెప్పిన వారము కాము కాబట్టి మమ్మితండు చెఱసాలలో స్వేచ్చగా తిరుగుట కంగీకరించి మిక్కిలి ప్రేమతో జూచుచున్నాడు.

రాజ-- అట్లయిన శోభనాద్రిరాజు మీకెంతో యుపకారమే చేయు చున్నాడు.