Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునుకొండవప్రకరణము

తయు గవ్వయయినఁబోకుండ మొలలోతు భూమిలో గానబడెను. వెంటనే కూలివాండ్రచేత సొమ్మును మోయించుకొని నీలాద్రిరాజును నాతని భృత్యులను బట్టుకొని తీసికొని వచ్చుటకుయి భటుల నియోగించి సుబ్రహ్మణ్యము రాజుగారి యింటికివెళ్ళి నడచిన సర్వవృత్తాంతమును నెవేదించి, కావళ్ళతో సొమ్మును ముందుపెట్టి దొంగల నొప్పగించెను: నీలాద్రిరాజును సేవకులను తమ నేరమున కొప్పుకొని క్షమింప వేడుకొనిరి. అంతట రాజుగారు మిక్కిలి సంతోషించి సుబ్రహ్మణ్యమునకు గొప్ప బహుమానము చేసి,తాను పెద్దాపురము రాజునకు గప్పముగట్టెడి సామంతరాజు గనుక వారిని విమర్శింపఁ దనకధికారము లేదని దొంగలను రాజభటులవశమున నొప్పగొంచి వారికందరకు సుబ్రహ్మణ్యమును నాయకునిగాఁజేసి విచారణ కయి పెద్దాపురము కృష్ణజగపతి మహారాజుగారి కడకుఁ బంపెను. సుబ్రహ్మణ్యమును ఉమాపతిగారి యొద్ద సెలవు పుచ్చుకొని పెద్దాపురమునకు ప్రయాణమయి బయలుదేరి వీధిగుమ్మమువద్దకు వచ్చునాటికి పైనుండి మాలబల్లి యొకటి మీదఁపడెను. అప్పుడు ప్రయాణమాపి గౌళి ఫలముయొక్క ఫలము కనుగొనుటకు పురోహితునకు వర్తమానము పంపగా నతడు తాటాకుల పంచాంగమును పట్టుకొని వచ్చిశిరస్సుమీద పడలేదు గనుక మరణభయము లేదనియు స్నానము జేసి దీపము పెట్టుకొని బ్రాహ్మణునకు కొంచెము సువర్ణదానము చేసిన పక్షమున బల్లి యొక్క దోషము పోవునని యుజెప్పెను. సుబ్రహ్మణ్యము వెంటనే శిరస్నానము చేసివచ్చి రాగిలో సువర్ణ ముండునుగనుక నాలుగుడబ్బులా బ్రాహ్మణుని చేతిలోనేపెట్టి గాయత్రి చేసికొని తరువాత నెంతో యెండ యెక్కినను ఆపూటనే పెద్దాపురమునకు వెళ్ళ బయలుదేఱెను.