పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

<biశ్g>రాజశేఖర చరిత్రము

భీమ-సుబ్రహ్మణ్యమా?గోటేటిసుబ్రహ్మణ్యము.

"సామి-ఇందాకనీవాలాగునఁజెప్పలేదు.

"భీమ--నీవాంజనేయుల వారితో నామాటాడుచున్నావు? ఆంజనేయు లిందాకనాలాగునఁజెప్పలేదనుచున్నావా? ఆయన యాలాగున నేచెప్పినాడు. నీవేపేరు నోటబఁట్టలేకత ప్పు పలికినావు చాలుఈ
పాటికిలే. ఇంకమాటాడకు.

 అనియాతడు సామిగానిని తనవెనుకకుఁ దీసికొని, సొమ్ము తీసినవాని పేరుబయలఁబడ్డదని కేకలువేసి చెప్పనారంభించెను. భటుల నాయకుడుఁను ఈదొంగతనము మఱియొకఱివలన జరిగినదికాదని యీప్రక్కనుండి యాప్రక్కకుఁదిరుగసాగెను. సభలోని యుద్యోగస్థులందఱును వీండ్రిద్దఱును గలసియా మాటచాకలి వానికినేర్పిపెట్టిరి కాని యిందుసత్యమేమియిలేదని తలఁచిరి. సాధారణజను లందఱును నిజముగా దొంగతన మాతడుచేయకపోయిన యెడలచాకలి వానికాపేరెట్లు తెలిసినదనియు, గట్టిగా సుబ్రహ్మణ్యము యాపనిచేసేనని యుఁజెప్పుకొను చుండిరి. ఊరనెక్కడఁ జూచినను సుబ్రహ్మణ్యము సొమ్మునుతస్కరించినట్టు "అంజనము వేయగా బయలు పడ్డదని మూకలు గట్టిమాటాడు కొనఁజొచ్చిరి; రాజుగారా మాటల నెంతమాత్రము విశ్వసించలేదు.

అప్పుడు సభామందిరము నుండిఁబోవు నపుడు త్రోవపొడుగునను ప్రజలెల్ల'ఈతడేకన్నమువేయించినాఁడ' నిసుబ్రహ్మణ్యమును వ్రేలుపెట్టిచూపనారంభించిరి. అందుచేత వాతడువట్టి నిరాపనింద వచ్చెగదా యనిసిగ్గుపడి రాత్రిభోజనమయిన తరువాత నొక్కడును బరుండి తనలోఁదానిట్లుచింతింప మొదలుపెట్టెను. ఆగోడకుకన్నము వేసిన వాఁడెవ్వఁడయియుండును? ఒకఁడంత