పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/175

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
పదునొకండవ ప్రకరణము

బరిణిలోని కాటుకను వాని కుడిచేతిలో రాచి దానిని నిదానించి చూచి దానిలో నేమికనఁబడునో దాని నెల్ల తనకుఁ జెప్పుచుండుమని యుత్తరువు చేసెను.

భీమ-చేయి దీపము దగ్గఱగాఁబెట్టి దానికేసి ఱెప్పవాల్పకచూడు. నీకిప్పు డేమియినఁ గనబడుచున్నదా?

సామి-లేదు. కాటుక మాత్రము కనఁబడుచున్నది.

భీమ-చూపు చెదరనీయకు. ఇప్పుడే మయినఁ గనఁబడు చున్నదా?

సామి-కనఁబడుచున్నది. పెద్ద బంగారపురేకువలేనున్నది.

భీమ-ఆ రేకునడుమనేమయినా నున్నదా?

సామి-అవిసిచెట్టున్నది.

భీమ-అవిసిచెట్టు కాదశోకవృక్షము. ఆ చెట్టుకొమ్మలలో నెవరున్నారోచూడు.

సామి-పెద్ద కోతియున్నది.

భీమ-కోతి యనబోకు. ఆంజనేయుల వారను. నీమనసులో నమస్కారము చేసి యేమిచెప్పునో తెలిసికో.

సామి-ఏమో పెదవులు కదల్చుచున్నాఁడు ఆమాటలు నాకుఁ దెలియవు. భీమ-రాజుగారి సొమెవ్వరెత్తుకొని పోయినారో యడుగు.

సామి-రాజుగారివద్ద కొలువున్నవారిలోనే యొకరు తీసినారను చున్నాఁడు.

భీమ-వారియింటిపే రడుగు

సామి-గోటివారు.

భీమ-పేరుకూడ చెప్పమను.

సామి-సుబ్బమ్మ.