పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/174

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

లను పట్టుకొని పోయిన సొమ్ము తెప్పింపలేక పోయినయెడల రాజుగారి వలన మాటవచ్చును గాఁబట్టి రాజకీయ యోగులలో నొకరిమీద పెట్టనిశ్చయించి, వేఱువేఱ పేర్కొని యెవరిమీఁదబెట్టిన నెవరికి కోపమువచ్చునోయని జడిసి, వారిలో లోకువ యైనవారి మీదకి త్రోయనెంచి, ఆపని తానుచేయుట యుచితమి కాదని యింటికిపోయి మాటాడి యంజనము వేయువారి నొకనిని పిలుచుకొని జాములోపల మరల వచ్చెను.

నాయ-మోయి భీమన్న! రాత్రి రాజుగారింట ధనము పోయినది. నీవాధన మపహరించిన వానిని చెప్పఁగలిగిన యెడల, నీకు గొప్ప బహుమతి దొరకగలదు.


భీమ-అదెంతసేపు? సొమ్ము తెప్పించుకోగలిగిన యెడల, అంజనము వేసి నిమిషములో పేరు చెప్పించెదను.

వాయ-అంజన మిప్పుడు నీయెద్ద సిద్ధముగా నున్నదా?

భీమ-ఉన్నది. అది పిల్లికన్నులవానికే గాని పాఱదు. అటు వంటివాని నెవ్వని నైనను పిలిపించవలెను.

నాయకుడాఁ మాటలు విని యొక భటుని బిలిచి, "నీవు పోయి చాకలి సామిగానిని తీసుకొనిరా. వానివి పిల్లి కన్నులు" అని నియమించెను. వాఁడు వెంటనేపోయి రెండుగడియలసేపునకు సామిగానిని వెంటఁబెట్టుకొని వచ్చెను. ఈలోపల సంజనము వేయువాడు దాసిగాని చేత గది నొకదానిని సలికించి, అందొకమూలను నూనెతో గొప్ప దీపమును వెలిఁగించి తాను స్నానముచేసి వచ్చి దీపము ముందట పిండింముగ్గుతో నొకపట్టు పెట్టి అం దాంజనేయ విగ్రహమును కాటుక కరాటకమును ఉంచి పూజ చేయుచుండెను. చాకలివాడు వచ్చినతోడనే యాతడు తనపూజను చాలించి, పట్టులో వానిని గూరుచుండఁ బెట్టి