పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


పదుకొండవ ప్రకరణము

గొంత సేపటికి రాజభటులు సందడి చేయుచు నూర నలుప్రక్కలను దిరిగి, తమకు విరోధులుగా నున్నవారి నందఱిని పట్టుకొని ఠాణా కీడ్చుకొనిపోవ మొదలు పెట్టిరి; అక్కడ నున్నవారు వాండ్రను కొట్లలోఁ బెట్టి నేరము నొప్పుకొండని పలువిధములఁగొట్టి బాధింపఁ జొచ్చిరి; కాని వారు నిరపరాధుల నెందఱిని పట్టుకొని బాధ పెట్టినను, నిజమయిన దొంగలను మాత్రము కనిపెట్టలేకపోయిరి. ఉత్తరపు దిక్కున కోటగోడకు నిచ్చెన వేసికొని దొంగలు లోపల బ్రవేశించినట్లు అడుగుల జాడ కనపడు చుండెను; గచ్చుతో కట్టిన ధనమున్న గదియొక్క రాతిగోడ చిన్నతలుపెత్తుటకు తగినంత పాణిద్వారమొకటి కొట్టఁబడియుండెను. ఆద్వారమును తవుటకు బలమయిన పనివాండ్రు ముగ్గురు పూనుకున్నచో నధమపక్షము రెండు జాములు సేపయినా పట్టును. రాత్రి యంతసేపు పనిచేయుటకు దొంగలనిద్ర యేమయిపోయినదా యని విచారింప వలసిన యక్కఱలేదు. వారినిద్ర యంతయు వచ్చి కావలివాండ్ర వాశ్రయించినది. కొట్టులోపల రూపాయలసంచులు చప్పుడైనప్పుడు ధనలక్ష్మి మూలుగుచున్నదని జడిసికొని కావలియున్నవారు భద్రమైన దూఱి తలుపు వేసికొని ప్రాణములు కాపాడుకొనిరనియు గ్రామములో నొక ప్రవాదము పుట్టినది. ఇదంతనిజమో యీశ్వరునకుఁ దెలియును. ఏది యెట్లయినను ధనలక్ష్మి మాత్రము మారాత్రి నరవాహ వారూధురాలయి నూతన ద్వారమున కోటవిడిచి వెళ్ళిపోయిన మాటమాత్రము వాస్తవము. ఎన్నివిధముల ప్రయత్నముచేసినను రాజకీయభటులకు దొంగలజాడ యెక్కడను గానరానందున,విసిగి తుదకు వారు తమ నాయకుని కడకువచ్చి తాముపడ్డ ప్రయాసమునంతను జెప్పుకొనిరి. అందుమీద నాతడు చేయవలసిన వనియేమియు తోచక కొంతసేపాలోచించి, దొంగ