పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము
అని, కాగితమును కలమును సిరాబుడ్డియు తెప్పించిన మీదట తాను జూచిన దంతయు జ్ఞాపకమును బట్టి పటమును వ్రాసి నీలాద్రి రాజు గారి చేతి కిచ్చెను. ఆయన దానిని జూచుకొని యాయాస్థలముల యుపయోగములను గుఱించియు పనియొక్క గట్టితనమును గూర్చియు ప్రశ్నలు వేయజొచ్చెను. సుబ్రహ్మణ్యమును దనకు చెలిసినంత వఱకు సదుత్తరములను జెప్పుచు వచ్చెను.
నీలా-ఉత్తరవువై వునవీధిప్రక్క నున్న దేకాదా ధనాగారము?
సుబ్ర-అవును.
నీలా-అంతయు బాగుగనున్నది కాని కోటగోడ యెత్తెంత పెట్టినారు?
సుబ్ర-సుమారు పండ్రెండడుగు లుండవచ్చును.
నీలా-మన మీతోటపటము వ్రాసికొన్న సంగతి యెవ్వరికిని దెలియనీయక రహస్యముగా నుంచవలెను. రాజులకు తమ కోటవంటిది మఱియొకటి యుండుట కిష్టముండదు.
అని చెప్పి లోపలనుండి తమలపాకులును పోకచెక్కలును పళ్ళెముతో దెప్పించి తాంబూల మిచ్చి, కోట కట్టించునప్పుడీ పటము వ్రాసియిచ్చినది మీరే యని రాజుగారితో జెప్పెదము నుండీ యని పంపివేసెను. సుబ్రహ్మణ్యమామాటలకు సంతోషించి సెలవు వుచ్చుకొని,తన కొక వేళ గొప్పయుద్యోగ మగునేమోయను నాశతో పరిపరి విధముల నాలోచించుకొనుచు మెల్లగా నింటికి వచ్చెను.
తరువాత నాలుగు దినముల కొకనాడు ప్రభారసమయముననే రాజుగారియింట దొంగలుపడి ధనాలయము లోని నగలును రొక్కమును దోచుకొని పోయినారని యూరనొక కింపదంతి కలిగెను.పిమ్మట