పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/171

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నీలా-మీకింకొక రహస్యము చెప్పెదను. బాల్యములో మేమును గాళహస్తిరాజుగారుకలిసి జూదమాడెడివారము. ఆయన సంగతి మనకెందుకుఁగాని, అప్పుడాయన బోగముదాని నుంచుకొన్నాడుసుమ్మా.

సుబ్ర-తమరు ప్రొద్దుననే యక్షతలు ధరించినారు. పార్ధివము చేయుచున్నారా?

నీలా-పూర్వము పార్ధివము చేయుచుంటిమి కాని యిప్పుడు తనపూజమాత్రము చేయుచున్నాము. మీరాజుగారుకూడ శివపూజా దురంధరులట కాదా? అందుచేతనే వారికి విశేషైశ్వర్యము కలిగి యున్నదని విన్నాము.

సుబ్ర-పదిలక్షలకు తక్కువ లేదని వాడుక.

నీలా-అది యంతయు గోటలోనేగదా యుండును?

సుబ్ర-కోటలోనే యుండును.అక్కడ జిరకాలము నుండి నమ్మకముగా బని చేయుచున్న ముసలిబంట్లు కావలియుందురు.

నీలా-విజయనగరపు మహారాజుగారు క్రొత్తగా నొక కోటను గట్టదలచి, మేము చూచిన పట్టణములలో నున్న కోటల పటలములను వ్రాయించి తీసికొని రండని మఱిమఱి చెప్పినారు. మొన్ననే పెద్దాపురపు రకోట పటమును దెప్పించినాము. మీరీ కోటపటమును కూడా వ్రాసి యియ్యగలరా?

సుబ్ర-చిత్తము కాగితము కలమును దెప్పింపుఁడు; ఇప్పుడే వ్రాసి యిచ్చెదను.