పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>సుబ్ర-నాదే. మఱియొకరిమూట నాయొద్దకెందుకువచ్చును ?

భటు-నీది కాదు. నీవనుమానవు మనుష్యుడవుగాఁ గనఁబడుచున్నవు. నిన్న నే నిప్పుడు వదలిపెట్టను. తిన్నగా ఠాణాకునడువు.

సుబ్ర-నేను దొంగనుకాను. చిన్నప్పటినుండియు నింతప్రతిష్టతో బ్రతికినవాడను. నన్ను విడిచి పెట్టు.

భటు-చీకటి పడ్డతరువాత గ్రామమునకు వచ్చిన వారిని విడిచిపెట్టకూడదని మారాజుగారి యాఙ్ఞ. విడిచిపెట్టెడు పక్షమున నా కేమిచ్చెదవు ?

సుబ్ర-నాలు గణా లిచ్చెదను నన్ను విడిచిపెట్టు.

భటు-నాలుగురూపాయలకు తక్కువవల్లపడదు.నీవుచూడఁబోయిన దొంగవుగాఁ గనఁ బడుచున్నావు. మూట నక్కడ పెట్టు. పెట్టకపోయిన ని న్నేమి చేసెదనో చూడు.

ఆవరకు బాహ్యభూమికివెళ్ళి తిరిగివచ్చుచున్న యొకపుషుడింతలో నామార్గముననే యింటికిఁ బోవుచు, ఆసందడి విని యచటనిలుచుండి "ఏమా మనుష్యుని నట్లుతొందరపెట్టుచున్నారు ?" అని యడిగెను.

సుబ్ర-చూచినారా యీమష్యుడు నాలుగురూపాయలిచ్చినంగాని నన్ను పోనియ్యనని నిర్భందపెట్టుచున్నడు.

పురు-సుబ్రహ్మణ్యమా ? నీవా! కంఠస్వరమునుబట్టి యానవాలు పట్టినాను. ఇక్కడి కొక్కడవును రాత్రివేళ నెందుకు వచ్చినావు ? ఇంటికడనుండి చెప్పకుండ పాఱిపోయి రాలేదు గదా ? ఇంటికి రా పోదము ?

సుబ్ర-ఉమాపతిగారా ? మీ రిక్కడ నున్నారేమి ? మీ<poem>