పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునొకండవ ప్రకరణము

సుబ్రమ్మణ్యము పిఠాపురము బ్రవేశించుట - ఒక మిత్రుఁడు కనఁ
బడి యింటికిఁ గొనిపోయి యాదరించుట - నీలాద్రిరాజుచర్య -
రాజుగారి ధనము పోవుట - అంజనము వేయుట - పోయిధనము
నీలాద్రిరాజు దొడెలో మఱికొంత సొమ్ముతోఁ గూఁడ దొరకుట.

తల్లి దండ్రులను వీడ్కొని బయలుదేఱినాఁడు సుబ్రహ్మణ్యము త్రోవదప్పి యెచ్చటికిపోయి తుద కపలసంజవేళ పిఠాపురముచేరెను. అప్పుడు కొందఱు దుష్టాత్ము లొకచోటఁ గూరుచుండి యాతని వాలకమును జూ తమలోఁ దామలోచించుకొని "యీతఁడు పల్లెటూరి వాఁడుగా గనఁబడు చున్నాడు. ఈతని బెదిరించి మన మేమయిన పుచ్చుకొందము" అని నిశ్చయము చేసికొనిరి. వెంటనే యాగుంపులో నుండి రాజభటుఁ డొకఁడు పైకి వచ్చి ముందుకు నడిచి సుబ్రహ్మణ్యము వచ్చు మార్గమున కడ్డముగా నిలిచి గంభీరధ్వనితో " ఆవచ్చెడువారెవరు ? " అని అడిగెదను.

సుబ్ర-నెను బ్రాహ్మణుఁడను. భీమవరమునుండి వచ్చుచున్నాను.

భటు-ఇంత చీఁకటి పడిన తరువాత వచ్చుటకు కారణమేమి ?

సుబ్ర-తిన్నగా బయలుదేఱినది మొదలుకొని నడచివచ్చిన యెడల ప్రొద్దుండగానే యూరు చేరియుందును గాని, దారితప్ప పెడదారినపడి వచ్చినందున నింత యాలస్య మయినది.

భటు-ఈగ్రామములో నీకు బంధువు లెవరున్నారు ?

సుబ్ర-ఎవ్వరు బ్ంధువులు లేరు. రాజుగారి నాశ్రయించి పని సంపాదించుకో వలె నని వచ్చినాను.

భటు-నీ భుజము మీఁది మూట ఎవరిది ?