ఈ పుట ఆమోదించబడ్డది
Insert non-formatted text here
ములందుఁ | బ్రౌణవి త్తమాసభంగమందుఁ | జకితగోకులాగ్రజన్మరక్షణ మందు | బొంకవచ్చు సఘము పొందదధిప." అను శుక్రనీతిని దలఁచు కొని వివాహకార్యమునకై కల్లలాడితిని గదాయని కొంతమనస్సమా ధానము చేసికొన్నాను. ఈనీతిని బట్టియే యెవ్వరును మీతోఁ బద్మ రాజు విషయమై ప్రస్తావించినవారు కారు.
- రాజ-ఇప్పుడేపోయి యీసంగతి శోభనాద్రిరాజు నడిగి యనవలసిన నాలుగు మాటలును మొగము మీఁదనే యనివేసి వచ్చెదను.
- అని వెంటనే పోయి శోభనాద్రిరాజు వీధిగుమ్మములో నిలుచుండియుండఁగా జూచి "మీ రేమో గొప్పవా రనుకొని మీమాటలనమ్మి మోసపోయినాను. మీతో నింతకాలము స్నేహముచేసినందుకు, నాకొమార్తెను నిర్భాగ్యునకిచ్చి వివాహము చేయించు కొఱకా ప్రయత్నము చేసినారు ? అని నిర్భయముగాఁ బలికి రాజ శేఖరుఁడుగారు వెనుకకు మరలిరి. శోభనాద్రిరాజు మరలఁ బిలిచి "మావద్దఁ బుచ్చుకొన్న రూపాయలనిచ్చి మఱిపొమ్ము" అని నిలువఁ బెట్టెను. మీరిచ్చిన రూపాయలును నాయొద్దనున్న రూపాయలునుకూడఁ గలిపి వానితో వివాహమునకు వలయువస్తువుల నెల్ల కొన్నాను. ఇప్పుడు నాయొద్ద రొక్కములేదు; చేతిలోనున్నప్పు డిచ్చెదను." అని వెళ్లిపోవుచుండఁగా, శోభనాద్రిరాజు తనభటులచేత రాజశేఖరుఁడు గారిని పట్టి తెప్పించి చెఱసాలలో బెట్టించెను. ఆసంగతి మాణిక్యాంబకు దెలిసినది మొదలుకొని పెనిమిటికి సంభవించిన యాపదను దలఁచుకొని నిద్రాహారములు మాని స్దా యీశ్వరధ్యానము చేయుచు లోలోపల దు:ఖించి కృశించుచుండెను.
- ఈసంగతి జరిగిన మూఁడవనాఁడు సూర్యోదయమయిన తరువాత సీత వీధిగుమ్మములో నిలుచుండగా నెవ్వరో యిద్దరు మను