పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

ఆతఁడు శోభనాద్రి రాజుగారికి ముండలను తార్చువాఁడు. అతఁడు ధరించిన వస్త్రములు, మురుగులు మొదలగునవి రాజుగారివే. రాజుగారీయంత్రమునుపన్నినన్ను మీదగ్గరకు బంపిన నేనువచ్చి కార్యసంఘటనము చేసినాను. ఇంతకును దైవసంకల్ప మట్లున్నది కాబట్టి కార్యము జరిగిపోయినది.మీరన్నట్లు జరగపోయినదానికి విచారించినఫలములేదు.

రాజ- శోభనాద్రిరా జంతటి దుర్మార్గుడా? అతని సంగతినేను మొదట దర్శనమునకు వెళ్ళినప్పుడే తెలిసినది. ఈకపటము తెలియక రూపాయలు చేతిలోఁ బెట్టినప్పుడు నామీఁది యనుగ్రహముచేతనే ఇచ్చుచున్నాఁడనుకొన్నాను.రామరాజు ధర్మమాయని వివాహము కాకపోఁబట్టి సరిపోయినది కాని, లేకపోయినయెడల, నిష్కారణముగా పిల్లదానిగొంతుక కోసినవార మగుదుమే.

సుబ్బ- వివాహముకాలేదని మేలువార్తవిన్నాను.నిశ్చయమైనకార్యమెట్లు తప్పిపోయినది.

రాజ- మాజ్ఞాతియెకఁడు కాలము చేసినట్టుమయిలవర్తమానము వచ్చునందునమీరు పెట్టిన లగ్నమునశుభకార్యముకాలేదు.మరల క్రొత్తముహూర్తమును పెట్టించుకొని రమ్మనియే యాదుర్మార్గుఁడిప్పుడు నన్నుమీవద్దకుఁ బఁపినాఁడు.

సుబ్బ- ఆ పాపకర్ముని మాఁటయిఁక నాతోఁ జెప్పకుండు.ఆపాపాత్ముని ప్రేరణమువలన మీయింటముహూర్తము పెట్టినవాఁడేనాకు రోగ మారంభమైనది.కాఁబట్టిమీయొడలచేసిన మోసమునకుశిక్షగా భగవంతుఁడు నాకీయాపదను దెచ్చిపెట్టినాఁడనుకొని వివాహముకాక మునుపు రోగము కుదిరెనా మీతో నిజముచెప్పి వేసిపాపపరిహారము పొందవలెనని కోటి వేల్పులకు మ్రొక్కుకొన్నాను. అలాగునను కుదిరినది కాదు. అటు తరువాత వారిజాక్షులందు వైవాహిక