పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదవ ప్రకరణము

ణుల కిటూవంటిచావు యోగ్యమయినది యాతురసన్యాస మిప్పించి నారు. ఆ రాత్రి నుండియు రోగము తిరిగి యిప్పుడు కొంత వ్యాధి కుదిరియే యున్నాఁడట. మీరిప్పుడే పోయి యీమాసములో వివాహముహూర్త యెప్పుడున్నదో వచారించి రండి.

రాజ-చిత్తము. సెలవు పుచ్చుకొనెదను. అని లేచి తిన్నగా సుబ్బారాయుడు సిద్దాంతిగారి యింటికిఁబోయి చావడిలోపీటలమీఁద గోడకుఁజేరగిలఁబడికూరుచుండియున్న యాయనకు నమస్కరించి,దేహము స్వస్ధముగా నున్నదాయని రాజశేఖఁరుడుగారు కుశల ప్రశ్నయు చేసిరి.

సుబ్బ-కొంతవఱకు నెమ్మదిగా నున్నది. నాగోగము ప్రబలముగానుండి నేను తెలివితప్పి యున్నయప్పుడు, నా సొత్తునపహరింపలెనని నాఙ్ఞతు లందఱును జేరి నాకు సన్యాస మిప్పించినారు. నా రెండవ పెండ్లి భార్య కాపురమునకువచ్చి యాఱు నెల లయినది. దానితోపట్టుమని యొక సంవత్సరమైన సౌఖ్య మను భవింపలేదు. నాదేహము బలపడఁగానే యింట సహిత ముండనీయక నన్ను తఱిమి వేయుదురు.

రాజ-జరిగిపోయినదానికి వచారించిన ఫలమేమి? మీరిఁక సంసారసుఖములను మఱచి, మీరున్న యాశ్రమమునకు ముఖ్యముగా గావలసిన ప్రణవమును జపించుకొనుచు ముక్త మార్గమును జూచుకొండి.

సుబ్బ-నేనిప్పుడు సర్వసంగములను విడిచియున్నాను. నేను మీకుఁ జేసిన యపకారమును మఱచి నన్ను మన్నింపవలెను.

రాజ-మీరు నాకేమి యపకారము చేసినారు?

సుబ్బ-చేసినపాపము చెప్పినఁ బోవునని పెద్దలు చెప్పదురు. మీరు మొన్న సీతనిచ్చి వివాహముచేసి నతఁడు ధనవంతుఁడుకాఁడు.