Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

రా మ - మీకు నేనేమి కార్యవిఘాతము చేసినాను?

రాజు- రామమూర్తి పోయినట్టు జాబు స్ర్ర్రష్టించి తనింట లేనప్పుడు మావాండ్రకిచ్చిపోలేదా?

రామ-నేను మీయింటి మొగమ తనము చూడలేదు. ఇటువంటి లేని దోషములు నామీఁద నారోపించిన మీ ------తిన్నగా జరుగదు నుండీ.

రాజ - మీరు మాయింటి మొగమే యెఱుఁగని వారు , మీ చేతి కఱ్ఱ యిది యిక్కడ కేలాగు వచ్చింది?

రామ- అయిదారు దినములనుండి నాచేతికఱ్ఱను గాలించి దాని నిమిత్తమై సకల ప్రయత్నములను జేయు చున్నాను. సరిసరి తెలిసింది. మీరాకఱ్ఱను యెత్తుకొని వచ్చి దానిని తప్పించు కొనుటకయి యెదురు నామీదను దోషారొపణలు చేయుచున్నరా? మీరేమో యింత వరుకును యోగ్యులనుకొనుచున్నాను.

రాజ- నా వద్ద నీవేమి యయోగూతను కనిపేట్టినావు? ఇఁక ముందు నీవెప్పుడును మాయిల్లు త్రొక్కి చూడవద్దు.
రామ-నీవు నీవనఁబోకు నీయింటిజోలికి యెవరికిఁగానలేరు?

అని చివాలున లేచి రామరాజు వెళ్ళిపోయెను.అతని వెనుకనే బయలు దేరి రాజశేఅఖరుఁడుగారు శోభనాద్రిరాజుగారి యింటికిఁ బోయి, జరిగిన యావద్వ్రత్తాఁతమును వినిపించి ; మరలా ముహుర్తము పేట్టుటకయి సిద్ధాంతిని పిలిపించవలెనని చెప్పిరి.

శోభ- మీలోపల ముహుర్తము పెట్టిననాఁటి రాత్రియే సిద్ధాంతికి జ్వరము తగిలి, వ్యాధి ప్రబలమయి జీవితాశంపోయినందున మంగళవారమునాఁడు మధ్యాహ్నమున ఆయనను భూశయనము చేసినరు. అప్పుడాయనబంధువులందఱును జేరి చదువుకున్న బ్రాహ్మ