పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదవప్రకరణము

దినములో మరలనచ్చి మిమ్మందరను జూచి రెండు దినము లుండి పొయెదను.

అని చెప్పి రామమూర్తి గారు తన పనిమీఁద రాజసభకు వెళ్ళిపోయిరి. రాజశేఖరుఁడుగారును తిన్నఁగా భిమవరమునకు వవ్హ్వ్హి భార్యతో రామమూర్తి గాతి వార్తను జెప్పి వివాహ కార్యమునకు భంగము కలిగించినదుర్మార్గుని బహువిధముల దూషింపఁజొచ్చిరి. అప్పుడు కూలివాఁడు దిగఁబెట్టి పోయిన కఱ్ఱను తిసికొని సీత తండ్రికింజూపెను. దాని నాతఁడానవాలుపట్టిఁ, చేతఁబట్టుకొని చూచినాడు రామరాజు చూపిన కత్తి కఱ్ఱయిదియేనని భార్యతోఁజెప్పెను. వారిరువురును ఆలోచించుకొనినిశ్చయముగా నీయుత్తరము తెచ్చినవాఁడువ్ రామారాజేకాని మఱియొకడుకాఁడని దృఢపఱుచుకొనిరి.

రాజ-రామరాజూమవలన నుపకారమును పొందినవాఁడే? యిట్లేలచేసెనో?

మాణి-నాఁటి రాత్రి మన యందరిప్రాణములను గాపాడి మన కెంతప్రత్యుపకారమునుచూపినాఁడు. ఆతఁ డీయపకారము తలఁచుకొనుటకు నాకేమియు కారణము నూహించుటకు తోఁచకున్నది.

రాజ-మన శత్రువులవద్ద ధనము పుచ్చుకొని యీదుర్మార్గ మును కొడికట్టి యుండవచ్చను. సొమ్ము ప్రాణమువంటి మిత్రుల నయినను పగవారినిగాఁ జేయునుగదా?

మణి-నేఁటికాలమునకు ధనాశ యాతని కీదుర్బుద్ధిని పుట్టించెను గాఁబోలును. అదిగో రామ రాజును నచ్చుచున్నాఁడు. ఆతని నడిగిన సమ స్తమును తేటపడును.

రాజ-ఏమయ్యా!రామ రాజుగారూ! మావలన మహోపకారమును పొందియు మాకార్మవిఘాతము చేయుటకు మీకు ధర్మమా?