పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదవ ప్రకరణము

యోగముకూడ కలుగదా? మీవంటివా రందరును మెదలు విఱచుట చేత విధి లేక యొప్పుకోవలసి వచ్చినది. అయినను తమరీలాగున సెలవిచ్చినారని మానాన్నగారితో మనవిచేసి యేమాటయు రేపు విశద పఱిచెదను.

శోభ-ఈసారి నామాట వినకపోయినయెడల, మీస్నేహమునకును మాస్నేహమునకును ఇదే యపసానామ్ని మీయన్నగారితో నేను మనవి చేయు చున్నానని ముఖ్యముగా చెప్పవలెను.

పద్మ-చిత్తము. ఆయనమీయాజ్ఞను మీఱి నడవరు. సెలవు పుచ్చుకొనెను.

బద్మరాజు వెళ్ళిపోయినతరువాత సంబంధమును గురించి గట్టి ప్రయత్నము చేయవలయునని రాజశేఖరుఁడుగారు శోభద్రిరాజు గారిని బహూవిదములఁ బ్రార్ధించిరి. ఆతఁడును తన యావచ్చక్తిని వినియోగించి యీసంబంధమును సమకూర్చెద నని వాగ్దానము చేయుటయే గాక, ఆసంబంధము దొరికినయెడల రాజశేఖరుఁడుగారికి మునుపటికంటెను విశేష గౌరవమును బ్రసిద్ధియు గలుగఁ గలదని దృఢముగాఁ జెప్పెను. అంతటప్రొద్దుక్రుంకినందున రాజుగారు భొజనము నిమిత్తమయిలేచిరి. తక్కినవీ రందరును సెలవు పుచ్చుకొని యెవరియిండ్లకు వారు పోయిరి.

మఱునాఁడు నాలుగు గడియలప్రొ ద్దెక్కినతరువాత రాజశేఖరుఁడుగారు వెళ్ళినతోడనే, శోభనాద్రిరాజుగారు చిఱునవ్వు నవ్వుచు లోపలి నుండివచ్చి "నిన్న మనముపంపించిన వర్తమానమునకు రాత్రియే ప్రత్యుత్తరము వచ్చినదినుండీ" యని చెప్పెను. "ఏమనివచ్చినది? అని రాజశేఖరుఁడుగా రత్యా తురతతో నడగిరి. "నే సంతఖండితముగా వర్తమానము పంపిన