పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

రాజ-తమ రేగునము ప్రయత్నముచేసి మాకీమేలు చేయకతప్పదు. తమరు సెలవిచ్చిన తరువాత వారు మఱియొక విధముగాఁ దలఁచుకోరు.

శోభ-ఈపూట పద్మరాజుగా రిక్కడకే వచ్చినారు. మీ యెదుటనే వారితో చెప్పెదము. ఓరీ! స్వామిగా! మనబావరితో మంచిరాజు పద్మ రాజుగారు వచ్చి మాటాడుచున్నట్టున్నారు. వెళ్ళఁబోవునప్పుడొక్కసారి యవశ్యముగా దర్శనమిచ్చి మఱి వెళ్లుమన్నావని మనవిచేసి రా.

లంపతావాఁడు వెళ్లిన కొంతసేపటికి ముప్పదియేండ్ల యీడుగల నల్లని యొక పెద్దమనుష్యుఁడు చలువచేసిన తల్ల బట్టలు కట్టుకొని పది వ్రేళ్ళను ఉంగరములును, చేతులను మురుగులను, మొలను బంగారపు మొలత్రాడును పెట్టుకొని వచ్చెను. శోభనాద్రిరాజుగారు దయచేయుఁడని మర్యాదచేసి యాయనను యదావునఁ గూర్చుండ బెట్టుకొనిరి.

పద్మ-తమ సెల వయినదని సామిగాడు వర్తమానిము చెప్పి నందుకు, వెళ్లుచున్నవాడను మరలి నచ్చినాను. నాతో నేమయిన సెలవియ్య వలసినది యున్నదా?

శోభ-వీరు కొంతకాలమునుండి మనగ్రామములో నివసించి యున్నారు. మిక్కిలి దొడ్దవారు. వీరిపేరు రాజశేఖరుఁడుగారు. మీరు సంబంధముకొరకు విచారించుచున్నారని దెలిసినది. వీరి కొమార్తె యున్నది చేసికోరాదా? పిల్ల మిక్కిలి లక్షణపతి. వీరిది మొదటి నుండియు మంచి సంప్రదాయసిద్ధమైన వంశము.

పద్మ-పలువురు పిల్లనిచ్చెదమమి తిరుగుచున్నారు. నాకీవఱకును వివాహము చేసికోవలెనని యిచ్చ లేకపోయినది; ఆలాగే కాని యెడల, నాకు చిన్నతనములోనే వివాహమయి యీపాటి సంతాన