పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదవ ప్రకరణము

రాజ-ఆలా గయినపక్షమున, ఈసంగతిని ముందుగా మీ రొకసారి రాజుగారితో ప్రసంగించి వారిభిప్రయము తెలిసి కొనెదరా?

సుబ్బ-నేను ముందు వెళ్ళికూర్చుండెవను, తరువత మీరు కూడ రండి. మీరుఁడఁగానే మాటప్రస్తావమున మీకొమార్తె వివాహవు సంగతిని తెచ్చిచూచెదను. దానిమీఁదకొని రాజగరితొ నొక్కి మనివి చేయవలెను.

అనిచెప్పి సుబ్బరాయఁడుసిద్ధాంతి బయలుదేఱితిన్నగాశోభ నాద్రిరాజుగారియింతికిఁబోయికూరుచుండెను. తరువత మఱినాలుగు నిమిషములకు రాజశేఖరుఁడుగారును వెళ్ళిచేరిరి. అప్పుడు కొంత సేపు పలువిధముల ప్రసంగములుజరిగినమీఁదట రాజశేఖరుఁడు గారు కొమా ర్తెసంగతి సిద్ధాంతి మెల్లగాఁ దెచ్చెను.

సుబ్బ-రాజశేఖరుఁడు గారికి పెండ్లికావలసిన కొమా ర్తెయున్న సంగతి దేవరవా రెఱుగుదురా?

శోభ-ఎఱుఁగుదుము;ఈమధ్య విన్నాము. ఆచిన్నదానికిఁబెండ్లి యీడు వచ్చినదా?

సుబ్బ-ఈమధ్యాహ్నమే నేను చూచినాను.ఇక చిన్న దానిని నలిపి యుంచరాదు; మొన్న మాబంధువుల గ్రామములో నింతకంటె చిన్నపిల్ల సమర్తాడినది.

శోభ-ఎక్కడనైన సంబంధము వచారించినారా?

సుబ్బ-పెద్దపురములో మంచిరాజు పద్మరాజుగా రున్నారు. తమరు ప్రయత్నముచేసెడిక్షమున, ఆ సంబంధ మనుకూల పడ వచ్చును.

శోభ-అవును. అది దివ్యమయిన సంబంధమే కాని, వారీ చిన్నాదానిని చేసికొనుట కంగీకరింతురా?