పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నప్పుడు దు:ఖపడుట యటుండగా ఇప్పటినుండియు విచారపడవలసి వచ్చును; ఒక వేళ రాకపోయెడుపక్షమున వ్యర్థముగా లేనిపోని చింత పడవలసివచ్చును; ఆవట్టి విచారముచేతనే కీడు గలిగినను గలుగ వచ్చునుగాని, సంతోషపడుటచేత మేలుమాత్రము కలుగనేరదు.

సుబ్బ - పండితులై యుండియు మీ రాలాగున చెలవిచ్చుట బావ్యముకాదు. పెద్దలుచెప్పిన శాస్త్రములయందు మన మెప్పుడు గుఱియుంచవలెను. ఆమాట పోనిండి; మీకుమార్తెకు పెండ్లియీడు వచ్చిన ట్టున్నది; ఇంకను వివాహప్రయత్నము చేయక యశ్రద్ధగా నున్నారేమి?

రాజ - ఆవిషయ మైయే నేనును విచారించుచున్నాను. అనుకూల మయిన సంబంధము కనబడలేదు; చేతిలో సొమ్ము సహితము కనబడదు. మీఎఱుక నెక్కడనైనను మంచిసంబంధము లేదుగదా?

సుబ్బ - సం-బం-ధమా? ఉన్నదికాని, వారు గొప్పవారు! మీకు సర్వవిధముల ననుకూలముగా నుండును.

రాజ - వారిదేయూరు? మన మేమిప్రయత్నముచేసిన ఆసంబంధము లభ్యమగును.

సుబ్బ - వారిది పెద్దాపురము. వారియింటిపేరు మంచిరాజు వారు; వారికి సంవత్సరమునకు రెండువేలరూపాయలు వచ్చు మాన్యము లున్నవి; ఇవిగాక వారియొద్ద రొక్కముగూడ విస్తారముగా నున్నదని వాడుక. చిన్నవాడు ప్రథమవరుడు; స్ఫురద్రూపి, అతనికొక్క యన్నగా రున్నారుగాని, ఆయనకు సంతానములేదు. ముందు సమస్తమునకును ఈచిన్నవాడే కర్తయగును. పెండ్లికొమారునిపేరు పద్మరాజుగారు. ఆసంబంధము మన శోభనాద్రిరాజుగారు ప్రయత్నముచేసినపక్షమున మీయదృష్టబలమువలన రావలెను గాని మఱియొకవిధముగా మీకు లభింపదు.