పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

కయి నాకుమారుని ఇక్కడ వచ్చిన తరువాతనే పిఠాపురమునకు పంపినాను

ఈప్రకారము సంభాషణము జరుగుచుండఁగా కొంతమంది పెద మనుష్యులు వచ్చి ఆరుగుమీఁదనున్న బల్ల మీఁద గూరుచుండిరి. అప్పుడు రాజుగారు వారితో తాను చేసిన యద్భుతచర్యలను గురించి బహువిధముల ప్రశంసించిరి. చెప్పిన మాటలలో నేమియు చమత్కరము లేకపొయిన, అక్కడ నున్నవా రాగోపమును నవ్వుతో మాత్రము పూర్తిచేసిరి. వారందఱు నవ్వినపుడు తామొక్కరు నూరకున్న బాగుండదని నిజముగా నవ్వురాకపోయినను తెచ్చుకొని వారునవ్వినప్పుడెల్లను రాజశేఖరుఁడుగారును నవ్వుచు వచ్చరి. ఆరాజు తన్ను రాజశేఖరుఁడుగారు తెలిసినవాఁడనుకొట కయి ప్రతివిషయంలోను గొంచెము కొంచెముగా మాట్లాడి యన్నియు దెలిసిన వానివలె నటింపసాగెను. తన కేమియుఁ జెప్పుటకు తోచనప్పుడు అక్కడ నున్నవారి మొగములవంకఁ జూచి నవ్వుచువచ్చెను. అప్పుడాయన పాండిత్యమును సభవారందఱు నూరక పొగుడు చుండిరి.! ఇంతలోఁగొందరు గాయకులు వచ్చి సంగీతము
పాడుట కారంభింపని యెడల, వారిపొగడ్తలు సభ చాలించువరకు నుండుననుటకు సందేహములేదు. వారు పాట నారంభింపఁగానే యెల్లవారికిని ఇండ్లమీఁద ధ్యానము పాఱనారంభించినది. అయినను రాజుగా రేమనుకొందురో యని యందఱును కొంతసేపు శ్రమచేసి మాటలు చెప్పుకొనుచి నచటనే కూరుచుండిరి. ఆపాట వినివిని తాళలేక కడపట నొక పెద్దమనుష్యుడు చొరవచేసి, "వారు మంచివాఅని యదేపనిగా శ్రమయిచ్చుట న్యాయముకాదు. కాఁబట్టి యీపాటిలి పాట చాలింప ననుఙ యియ్యవచ్చు"నని చెప్పెను. సభవారందరును అది యుక్తమని యేకవాక్య ముగాఁ పలికిరి. అంతట సభచాలించి యంద~ఋఊణూ సెలవు పుచ్చుకొని