పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
తొమ్మిదవ ప్రకరణము

మోటపెట్టఁగా ఆతఁడాపూటకు తమయింట వంట చేసికొనుట కంగీకరించి, పొరుగునున్న యొక వైదిక బ్రాహ్మాణుని పిలిపించి రాజశేఖరుఁడుగారు కాపురముండుటకయి వారిపాత్రల్లిమ్మని చెప్పెను. అతడా యిల్లు బాగుచేయించినం గాని కాపురమున కక్కఱకు రాదనియు, తన భార్య సమ్మతి లేక యియ్య వలదుపడదనియు, పెక్కు ప్రతి బంధములను జెప్పెను; కాని రాజశేఖరుఁడుగా రాతనిని కూరుచుండ బెట్టుకొని పరోపకారమునుగూర్చి రెండుగడియలసేపు వుపన్యాసముచేసి యిల్లు బాగు చేయించుట పేరుచెప్పి రెండు రూపాయలు చేతులోఁబెట్టిరి. చెప్పిన వాక్యము లన్నిటికన్నను చేతిలోఁబెట్టినసొ మ్మాతినిని నిమిషములో సమాధాన పఱిచింది. కాబఁట్టి రాజశేఖరుఁడుగారు వెంటనేబోయి బండిని తోలించుకొని వచ్చి యాపూట కిరణములోపల వంటచేసికొని భోజనముచేసి దీపములవేళ సకుటుంబముగా ఆగ్రామ పురోహితులయింటఁ బ్రవేశించిరి. ఆయిల్లు పల్లపునేలయందు గట్టఁబడి యున్నది; గవాక్షముల బొత్తిగా లేనేలేవు; వాస్తుశాస్త్రప్రకారముగా దూలములు యజమానునిచేతి కందులాగునఁ గట్టబడిన యాయింటి గోడలేపొట్టివి గనుక గుమ్మము లంతకన్న పొట్టివిగానుండెను. కాఁబట్తి యొక్కడను వంగినడవని వారుసహిత మక్కవంగి నడుచుచుందురు; లోపలి గోడలెత్తుగా నుండక పోయినను దొగలభయముచేతఁ గాఁబోలును గాలివచ్చుటకు వలను పడకుండ దొడ్డిచుట్టును నున్న గొడలు మాత్రము మిక్కిలి యెత్తుగాఁబెట్టఁబడినవి! కాని యింటివా రాయిల్లు విడిచి పెట్టి వెళ్ళిన తరువాత చూచువారు లేక కూలి యిప్పుడు మొండిగోడలుగా నున్నందున లోపలికి గాలివచ్చుట కవకాశము కలిగినది. పూర్వమిల్లుగలవా రందున్నప్పుడెవ్వరో యొకరు సదారోగ బాధితులైయుండుచు వచ్చినందునను గృహధిపతియొక్క కూఁతు రందులోనే