పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

ఈ సంభాషణము ముగిసిన తరువాత ప్రొద్దుపోయినందున రాజశేఖరుఁడుగారు లేచి వెళ్ళి భొజనము చేసి, తరువాత నొక్కరు పరుండియాలోచించుకొని మోసములకెల్లను పుట్టినిల్లయిన ఈ పట్టణమును సాధ్యమయినంత శీఘ్రముగా విడిచిపెట్ట వలయునని నిశ్చయించుకొనిరి; కాఁబట్టి మఱునాఁడు ప్రాతఃకాలముననే యొకబండిని కుదుర్చుకొని వచ్చి, కుటుంబసహితముగా దానిమీఁదనెక్కి జాముప్రొద్దెక్కువఱకు భీమవరము చేరిరి. బండిమీఁద నెవ్వరో క్రొత్తవారు వచ్చివారిని యూరిలో నెల్లవారును జూడవచ్చి వారినివాసస్థలమును గుఱించియు, ఆగమన కారణమును గుఱించియు ప్రశ్నలు వేయఁజొచ్చిరి; చెప్పిన దానినే మరల నడిగినవారికెల్ల జెప్పలేక రాజశేఖరుఁడుగారును మాణిక్యాంబయు విసిగిపోయిరి. వారందఱు నట్లు పనికట్టుకొని వచ్చి ప్రశ్నలువేయుటకయి ముందడుగిడుచు వచ్చినను, రాజశేఖరుఁడుగారు తమకు బసకావలెనని యడుగఁబోగానే తిన్నగా విపించుకోక లేదని వెనుకంజవేయ నారంభించిరి. అంతట రాజశేఖరుఁడుగారు బండిని వీధిలో నిలిపించి, తాము బయలు దేఱి బసనిమిత్తమయి యెల్లవారి యింటికి బోయి రెండుజాములవఱకును నుడుగుచుండిరి. గాని వారిలో నొక్కరును ఆపూఁట పండుకొని తినుటకయినను స్థలము నిచ్చినవారుకారు. క్రొత్తగా వచ్చినవారు గనుక రాజశేఖరుఁడుగారు బసనిమిత్తమయి తిరుగునప్పుడు వీధులలో నిలువచేయఁబడియున్న పెంటకుప్పలను జూచి యసహ్యపడుచు వచ్చిరిగాని యెరువును కుపయోగించుటకయి పొరుగూళ్ళకు సహితము గొనిపోయి యమ్ముకొనెడి యాయూరివారి కవియే కనుక నున్న సంగతిని తెలిసికొలేకపొయిరి. అట్లాదుర్గంధమునకు ముక్కు మూసికొని నడచి గ్రామకరణము యొక్క యింటికిఁబోయి వారి యింటిపేరడిగి యేదోయొక ప్రతబంధుత్వమును తెలుపుకొని మొగ