పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణ

రాజ- ఆయనగాక మఱియెవ్వ రయిన నున్నారా?
                    
సత్ర - మా గురువులు భానుమూర్తిగారు వేదాంతశాస్త్రమందు
నిరుపమానమయిన ప్రజ్ఞ గలవాఁడు. నాకు మొన్న రోగము వచ్చినపుడు పుణ్యలోకము వచ్చుటకు తగిన సదుపాయమును చేసి పది రూపాయలను పట్టుకొని పోయినారు. ఆమఱునాఁడే దొంగవస్తు వొకటి ఆయన యధీనములో కనఁబడినంగిన దుర్మార్గులయిన రాజభటు లాయనను నిష్కారణముగా తీసుకొనిపోయి ఠాణాలో పెట్టినారు.

రాజ- గురువు లెప్పుడును శిష్యులకు దమవ్రేలితో స్వర్గమునకు త్రోవ చూపుచుందురు. కాని తాముమాత్రము స్వర్గమార్గము మాట యటుండఁగా దా మ్ను యీ లోకమునే త్రోవఁగానక గోతిలో పడుచుందురు.తార్కికుఁడును నగుట సులభము కాని యోగ్యుఁడగుట యంతసులభము కాదు. ఆమాట యటుండనిచ్చి మీ పట్టణములోని వారి స్థితిగతులను కొంచెము చెప్పుము.

సత్ర- కష్టపడి పనిచేయువారు తాము తెచ్చుకొన్నది అన్న వస్త్రాదులకు చాలక బాధపడుచుందురు; పాటుపడని సోమరిపోతులు పూర్వు లార్జించినమాన్యముల ననుభవించుచు విలువబట్టలను పంచభక్ష్యపరమాన్నములును గలిగి సుఖింపుచుందురు. తాత ముత్తాతల నాటి నుండియు పరువుతో బ్రతికినవారు కొందఱు జీవనము జరగక రాజు గారిని చిరకాలము నుండి యాశ్రయించుచున్నారు; కాని యెంత యనుసరించినను రాజు నిర్దయుఁడై చదువురాదని చెప్పి వారికి కొలువులియ్యకున్నాఁడు.

రాజ- అదృష్టవంతులము కావలెనని చేయు ప్రయత్న మొకటి తప్ప వేఱుప్రయత్నము లేనివా రెప్పుడును భాగ్యవంతులు కారు. భాగ్యదేవత మాఱుపని లేక తనకొఱకే కాచుకొనియున్న వారియొద్ద