పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖ చరిత్రము

యానందింపవలెనని తలంచి రాజశేఖరుఁడుగారు వీధిలోనే నిలువఁబడి వినుచుండిరి. ఆసభికులందఱును తామైనను పొగడుకొనుచుండిరి; లేదా స్నేహితులు పొగడుటకు సంతోషమైనను బొదుచుండిరి; వారందరునట్లానందించుచుండఁగా రాజశేఖరుఁడుగారు తన్నవరును పొగడువారును పొగడుకొన్న వినువారునుగూడ లేనందునఁ జిన్నఁబోయి యిఁక నిందు నిలువఁగూడదనుకొని యక్కడినుండి బయలుదేఱిరి. అటుపిమ్మట నాతఁడు త్రోవపొడుగునను నలుగైదు రమణీయసౌధములను జూచి లోపలికిఁబోయి వానిని చూడవలెనని బుద్ధిపుట్టి గుమ్మమెక్కి తాను పండితుఁడననియు మేడను చూడ వేడుకపడి వచ్చితి ననియుఁ జెప్పి చూచెనుగాని ఆపట్టణస్థులందఱును ధనికులమీఁద మాత్రమే ప్రేమగలవారు గనుక ఆయన పాండిత్యమేమియు పనికిరాని మేడలయొక్క వెలుపటి భాగములను మాత్రము చూచి సూర్యస్తమయము కావచ్చినందున వెనుకకుమరలి తిన్నగ సత్రమువద్దకు చేరవలసివచ్చెను.


అప్పుడు వత్రపు బ్రాహ్మణుఁడు రాత్రివంటలేదు గనుక తీఱుబడిగా వచ్చి కూరుచుండి రాజశేఖరుఁడుగారితొ ముచ్చటలకు మొదలుపెట్టెను.

రాజ-మీపట్టణములో గొప్పపండితులున్నారా?


సత్ర- ఉన్నారు. ఆస్థానపండితుఁడయిన హరిపాపయ్యశాస్త్రులు గారు లేరా? ఆయన యెప్పుడు నెవ్వరితోను బ్రసంగింపఁడు గనుక సత్రములో జరిగిన సంతర్పణమునకు భోజనమునకు వచ్చినప్పుడు విశేషముగా మాట్లడకపోయిననౌ విశేషగా భొజిచినందున, ఆయన గొప్ప పండితుఁడనియే నేను నమ్మినాను.