శ్రీ
వివేకచంద్రిక
అను
రాజశేఖరచరిత్రము
మొదటి ప్రకరణము.
ధవళగిరి - దేవాలయవర్ణనము - గోదావరి యొడ్డున నున్న ధర్మశాల
మీఁద ప్రాతఃకాలమున రాజశేఖరుఁడుగారు వచ్చి కూర్చుండుట -
అప్పు డచ్చటికి వచ్చిన సిద్ధాంతి మొదలగువారి స్తుతివచనములు -
అందఱును గలిసి రామపాదములయొద్దకు బైరాగిని చూడఁబోవుట.
శ్రీ నాసికాత్య్రంబకముకడ కడుదూరమున నెక్కడనో పశ్చిమమున నొక్కయున్నతగోత్రమున జననమొంది ఊర్మికాకంకణాదుల మెఱుంగులు తుఱంగలింపఁ దనజననమునకు స్థానమైన భూభృద్వరపురోభాగముననే పల్లములంబడి జాఱుచూ లేచుచుఁ గొంతకాలముండి యక్కడినుండి మెల్లమెల్లగా ముందుముందుకు ప్రాఁకనేర్చి యెల్లవారల చూడ్కులకు వేడ్కలు నింపుచు, పిదప నవ్యక్తమధురస్వరంబులతో ముద్దులు గులుకు శరవేగమునఁ బరుగిడుచు, ఆపిమ్మట ఘనతరుల చెంతఁజేరి తల్లివేళ్ళనువిడిచి తక్కినవేళ్ళనంటుచుబాఱి జమ్ములోనడఁగి దాఁగుడుమూఁత లాడుచు, వెలువడి నిదర్భాదిదేశములగుండబ్రయాణములుచేసి త్రోవపొడుగునను వచ్చి పుచ్చుకొననివారికేబ్రాకారము స్నానపానంబులకు వలయునంత నిర్మలజలం బో స్తంభమొకటి యున్నది.మందిఱి నానం ద మొందింఱుగంటలు గాలికి గదులుచు సదా శ్రావ్యలకును ఫలవృక్షములకుదనుపు చుండును.ఆస్తంభమునకును మొదట