పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తలుపు వేసికొం డని చెప్పి యొక విధవ ముందుగా రుక్మిణిని లోపలికిఁ దీసికొనివచ్చి మఱియొక గదిలోనికిఁ బంపి తలుపు దగ్గఱగా వేసెను. తరువాత లోపలినుండి యాఁడువారు వచ్చి మాణిక్యాంబ మొదలైనవారిని పడమటింటిలోనికిఁ దీసికొని పోయి రుక్మిణికి దటస్థించిన యవస్థ కయి యేడుపులు మొదలైనవి చల్లారినపిమ్మట, వారినిమిత్త మావఱకు చేసిన వంట మిగిలియున్నది కాన వారికి వడ్డించి రాజశేఖరుఁడుగారినిమిత్త మప్పుడత్తెసరు పెట్టిరి. అందఱును భోజనము లయినతరువాత మూడుజాములకు పరుండి సుఖనిద్రచేసిరి.

రాజశేఖరుఁడుగారు కొన్నిదినములు రామమూర్తిగారి లోపలనే యుండిరి. ఒకనాఁడు పడవమీఁద గోవూరునకుఁ బోయి యచటఁ బూర్వము గౌతముఁడు తపస్సు చేసినస్థలమును, మాయగోవు పడినచోటును జూచి గోపాదక్షేత్రమున స్నానము చేసి రాత్రికి మరల వచ్చిరి; మఱియొకనాఁడు కోటిలింగక్షేత్రమున స్నానమునకుఁ బోయి యచట నొక శాస్త్రులవలనఁ బూర్వ మాంజనేయు లొక లింగము నెత్తుకొని పోయి కాశీలో వేయుటయు అప్పటి నుండియు కాశికాపట్టణము ప్రసిద్ధిగనుటయు మొదలగుగాఁగల కథను వినిరి. ఇంకొకనాఁడు రాజరాజనరేంద్రుని కోటకుఁ బోయి అందులోఁ బూర్వము చిత్రాంగిమేడయున్న తావును సారంగధరుఁడు పావురముల నెగరవేసిన చోటును జూచి, పూర్వము రాజరాజనరేంద్రున కమ్మవారు ప్రత్యక్ష మయి నీ వెంతదూరము వెనుక తిరిగిచూడకుండ నడుతువో యంతదూరము కోట యగునని చెప్పుటయు, అతఁడాప్రకారముగా నడచుచు వెనుక గొప్ప ధ్వని యగుచుండఁగాఁ గొంతసేపటికి మనస్సు పట్టలేక వెనుక తిరిగిచూచుటయు, చుట్టును బంగారుకట్టుతో నించుమించుగా ముగియవచ్చిన కోట యంతటితో