Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేనివా రయినను తామొక దుష్కార్యమునకయి ధతమును దుర్వినియోగము చెయలేదుగదా యని మనసులో నొకవిధ మయిన ధైర్యము నవలంబించి యున్న దానితోనే తృప్తివహించి యుండఁగా, వారి సౌఖ్యమునుగని యోరువలేనివారు కొందఱు మితృలని పేరు పెట్టుకొనివచ్చి వారును వీరును మిమ్ము దూషించుచున్నారని చెప్పి వారినెమ్మదికి భంగము గలిగించుచు వచ్చిరి; రాజశేఖరుఁడుగారు చేసిన వ్యయమును బూర్వము దాతృత్వ మని వేయినోళ్ళఁబొగడినవారే యిప్పుడు దానిని దుర్వినియోగమని నిందింపసాగిరి; ఆయన వలనఁ బూర్వ మెన్నివిధములనో లాభములను బొందినవారుసహితము రాజశేఖరుఁడుగారు వీధిలోనుండి నడచుచున్నప్పుడు వ్రేలితోజూపి యీయనయే తనధనమునంతను బాడుచెసికొని జోగియైన మహానుభావుఁడని దగ్గఱ నున్నవారితోఁ జెప్పి నవ్వ మొదలుపెట్టిరి. ఈవఱకును సీతను దనకొమారుని కిమ్మని నిర్బంధించుచు వచ్చిన దామోదరయ్య, యిప్పు డాపిల్లను దన కొడుకునకుఁ జేసికోమని వారివీరిముందఱను బలుకఁజొచ్చెను; ఆసంగతి కర్ణపరంపరచే రాజశేఖరుఁడుగారివఱకును వచ్చినందున ఆయన యొకఁ దినము పోయి యడుగఁగా తా నీసంవత్సరము వివాహముచేయ ననిచెప్పెను. సుబ్రహ్మణ్యమంతటి యదృష్టవంతుఁడు లోకములో మఱియెవ్వరును లేరని జాతకమువ్రాసిన సిద్ధాంతియే యాతనికిఁ గన్య నిచ్చెదనన్నవారి యింటికిఁ బోయి యాతనిది తాను జూచినవానిలోనెల్ల జబ్బుజాతక మని చెప్పి పిల్లనీకుండఁ జెసెను. రాజశేఖరుఁడుగారు ధనము లేక బాధపడుచుండియు నొరులనడుగుట కిష్టములేనివారయి యూరకుండఁగా నిజమైనమిత్రుఁ డొకఁడైన నుండకపోవునాయని యెంచి మాణిక్యాంబయు సుబ్రహ్మణ్యమును రాజశేఖరుఁడుగారికడకుఁ బోయి నారాయణమూర్తినిగాని మఱియెవ్వరి నైనను