పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

కొని లేచివచ్చెను. ఇప్పుడు సహిత మాంధ్రదేశపు బ్రాహ్మణులలో ముఖ్యముగా స్మార్తులలో నెరయింటనైన మృతినొందినప్పుడు బంధువులును కులమువరును తక్కినమతములయందువలె దమంతట వచ్చి సాయముచేయుట లేక పోగా వచ్చి బార్ధించునను రాక సాకులుచెప్పుటయు మొగ్స్ము చాటువేయుటయు బ్రాహ్మణజాతి కంతకు నవమానకరముగా నున్నది. సమస్తాపదలలోను హోరతరమయిన యీ యాపదకే యెవ్వరును తోడుపడనవు డొకమతములోనుండుటవలన బ్రయోజనమేమి ? ఉండకపోవుట వలన హానియేమి ? ఆదినము శవమింటనుండికదలునప్పటికి బగలు రెండుజాములయినది ! దహనముచేసి మరల వచ్చునప్పటికి బడమట నాలుగుగడియలపొృద్దున్నది. తరువాత విధ్యుక్తముగా పంచయనము మొదలయిన యవరకర్మ లన్నియు జరిగినవి .

మునుపటివలె రాజశేఖరుడుగారిని చూచుటకయి బంధువులును మిత్రువులును న్ంతగా వచ్చుట మానివేసిరి ; వీధిలో గనబడినపుడుసహితము చూడనట్టు తొలగిపోవుటకే ప్రయత్నించుచు విధిలేక కలిసికొని మాటాడునప్పుడు సంగ్రహముగా రెండుమూడు మాటలతోనే సరిపెట్టుచు వచ్చిరి ! పూర్వ మాయన మాటాడినపుడెల్లను ముఖస్తుతులను జేయువారు తరువాత సమ్మతిని గనబఱుచు శిరఃకంపములనుమాత్రము చేయుచు నాతనిమాటలను మందహాసముతో వినసాగిరి. కొన్నాళ్ళ కాశిరఃకంపములును మందహాసములను పోయి యారక యూకొట్టుట క్రింద మాఱినవి; అటుపిమ్మట నాయూకొట్టుటలు సహితము నడిగి హితబోధలు బలిసినవి; కాల క్రమమున హితబోధలు సహితమడుగంటి యొక రీతి పరిహాసములుగా బరిణమించినవి. రాజశేఖరుడుగారును దారాఉపుత్రాదులును ధనము