180
ఉద్భటారాధ్యచరిత్రము
ఉ. | మోచితి నుగ్రశాపభరమున్ శతదివ్యసమంబు లన్నియున్ | 260 |
క. | తనుతలఁచిన యత్నంబులు | 261 |
క. | నమ్మితి శంకరు వాక్యము | 262 |
వ. | అని యనేకప్రకారంబుల వితథమనోరథుండై చిత్రరథుం డాక్రందనంబు సేయ నయ్యర్ధరాత్రంబునందు గురువియోగవ్యధాదోదూయమానమానసుండై యుమ్మలింపుచుఁ గ్రమ్మువేదనల నపగతనిద్రుండగు ముంజభోజనరేంద్రుం డయ్యాకోశం బాకర్ణించి సంచలించి యిది యేమిపరిదేవనంబొక్కొ? ఇప్పితృవనభూమినుండి యుడుగక విడువనివేలంబై యతివేలం బగుచు సముద్రఘోషంబునం బోలె భీషణం బగుచు వీతెంచుచున్నయది. దీని నరయుదముగాక యని కాలభైరవంబగు కరాళకరవాలంబు కేలం గీలించి శైలశృంగంబు డిగ్గుసింగంపుఁగొదమయం బోలె హర్మ్యంబు డిగ్గనుఱికి పిఱికిదనంబు వోఁదఱిమి తత్కృపాణప్రభాపటలంబులం దమస్సముదయంబు విరియింపుచు నొక్కరుండ యుక్కుదళు కొత్త నిర్ణిద్రవేగంబున రుద్రభూమి డాయంజని తద్రోదనంబునకు నాదికారణంబగు నిశాచరు నుదారప్రభా | |