పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ఉద్భటారాధ్యచరిత్రము


గంధవహధూతరతిఖేదకాముకంబు
గోపురోపమ మగువల్లకీపురంబు.

149


సీ.

శ్రీసములాసంబు చెలఁగు నాయందును
        దనయందె కల దనఁ దగదు సుమ్ము
సంతతార్యాసక్తి సాగు నాయందును
        దనయందె కల దనఁ దగదు సుమ్ము
వృషలాలనఖ్యాతి వెలయు నాయందును
        దనయందె కల దనఁ దగదు సుమ్ము
రాజ[1]భూషణకేళి ప్రబలు నాయందును
        దనయందె కల దనఁ దగదు సుమ్ము


గీ.

తానెఁ సేనానిగలవాఁడు గాని యేను
గా ననఁగఁబోల దమితసేనాని యేను
ననుచు నప్పురి హరుపై నహంకరించు
హర్మ్యకేతనకింకిణికారవముల.

150


మ.

వలదింద్రోపలఖండదీధితులఠేవల్ కంఠహాలాహలం
బులు సున్నంబులు భూతివెల్లపడగల్ మూర్ధస్థితస్వర్ధునీ
జలపూరంబులు లోనఁ గ్రుమ్మరుసతుల్ సాఁబాలు మైఁగొన్న యా
యలరుంబోఁడులయొప్పునై తగుఁ బురిన్ హర్మ్యేశ్వరశ్రేణికిన్.

151


ఉ.

కేతువు నీట ముంచి తమకించి ధనుర్లత మళ్ళఁబెట్టి వి
ఖ్యాతబలంబుఁ జెట్టులను గట్టి గుణంబునఁ గల్గుపక్షముల్
వే[2]తెరలించి యంపగమి వేడుకమూలకుఁ ద్రోచి యమ్మనో
జాతుఁడు తత్పురిం గలుగు శైవులపైఁ జన లోఁగు నెంతయున్.

152


గీ.

అతిమనోహర గుణవిశాలాక్షి యగుచు
నిత్యశివసంవిధానసంస్తుత్య యగుచు

  1. పోషణ
  2. తరలించి. పా. ఆం.