పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

35


క.

చెల్లుబడి వజ్రదంష్ట్రుఁడు
ప్రల్లదమున సకలభూతబలముల కెల్లన్
వల్లభుఁడై తన కిల్లా
కెల్లగఁ జెల్లింపుచుండె హేలాగతులన్.

140


గీ.

ఓలి నెనిమిదిదిశల కొక్కొక్కదిశకు
నలువురును నల్వురును గాఁగ నలఘుబలుల
దలవరుల ముప్పదిరువుర నెలవు కొలిపి
ధరఁ బిశాచాధిపత్య మాతఁడు వహించె.

141


శా.

త్రాట న్నీట విషంబునన్ శిఖి నిజప్రాణంబులన్ బాసి వ
మ్మౌటన్ ఘోరపిశాచరూపమున హైన్యంబొందు తన్మర్త్యసం
ఘాటం[1]బందునఁ గొల్వుపట్టుటకునై కైకొల్వునానాదిశా
[2]పాటివ్యాప్తనిజాజ్ఞుఁడై చెడనిఠేవన్ వజ్రదంష్ట్రుం డొగిన్.

142


వ.

మఱియు నతం డాతపతాపంబున జీవితంబు వోవిడిచియు, నిర్ఘాతఘాతంబున మృతి వడసియు, సింహశార్దూలకుంభీనసవృశ్చికాదులచేత నీలిగియు, జిహ్వోత్పాటనంబు సేసియు, సానువులం దేనియుఁ బ్రాణంబు లుజ్జగించియుఁ, గాంతానిమిత్తంబున నంతంబుఁ గనియును, నిరశనత్వంబున బంచత్వంబు నొందియు, శూలంబునం గూలి కాలవశతఁ బొందియు, వెండియు నానావిధదుర్మరణంబులను దుష్కర్మంబులను బట్టువడియు, పుట్టగతి లేక భూతప్రేతపిశాచరూపంబులం జాపలంబునం గ్రుమ్మరు నమ్మనుజులం గలపికొని వర్తించి వర్తించి.

143


చ.

కొలిచిన యప్పిశాచములఁ గూరిమి నిట్లను వజ్రదంష్ట్రుఁ డీ
రలు భయ మింక మానుఁడు ధరాస్థలిఁ బుట్టగలండు భూరిని

  1. బుంద
  2. నాట. పా. అం.