పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ఉద్భటారాధ్యచరిత్రము


మ.

పడఁతుల్ దారు నదృశ్యులై నడికిరే ల్వా[1]రాడి గంధర్వు లె
క్కడ రుద్రాక్షయు భూతియుం దొఱఁగుమూర్ఖవ్రాతముల్ గల్గున
క్కడికిం బోయి తదీయబాలకుల జోక న్వారు వేపోయి పె
న్బడుముల్ గైకొని తృప్తిఁ జెందుదురు దౌర్భాగ్యంబె యోగ్యంబుగన్.

136


సీ.

తలలపైఁ బచ్చపూసలు కండతిండియు
        భీషణదగ్ధాస్థిభూషణములు
శూలాగ్రనరకంఠశోణితాస్వాదంబు
        బిలసంస్థశిశుశిరఃపలలసేవ
నవ్యకంకాళదండములు చేపట్టుట
        యురక నల్లడఁ జిచ్చు లుమియుటయును
బలితంవుఁ బ్రేవుల మొలనూలి చేఁతయుఁ
        గిలకలయును బొబ్బనులివుఠవణి


గీ.

కొరవిమసిబొట్టు పురి యలకోఱలందు
నింగలం బిడి రాజించు టెఱ్ఱగుడ్లు
మిడుఁగుఱులు గ్రమ్మఁ ద్రిప్పుచుఁ బుడమి మింట
బ్రమరివాఱుటయును బిశాచముల కొదవె.

137


గీ.

చిత్రసౌభాగ్యశాలియై చిత్రరథ స
మాఖ్య నలకాపురములోన సౌఖ్యలబ్ధిఁ
దనరు గంధర్వపతి వజ్రదంష్ట్రుఁ డనఁగ
వటముపై నుండె భూతభావము భజించి.

138


క.

ఆ మఱ్ఱియ యలకావురి
గా మది నూహించి ఖచరగణము లొగి నిజ
స్వామి యగు వజ్రదంష్ట్రుఁడు
దామును వర్తించు నివ్విధమున శివాజ్ఞన్.

139
  1. దాడి. పా.రం.