పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. వేలములందుఁ జూడ్కులకు వేడుకఁ జేసెఁ గరంబు నిర్మలో
త్తారపటీకుటీప్రతతి తన్నగరాంతికభూములన్ మహా
కాళనికేతనున్ భూజగకంకణు గింకరితాఖిలామరున్
హాళి భజింప వచ్చిన శివాచలకూటశతంబులో యనన్. 61

గీ. వివిధదేశావనీశ నివేశములను
జనము లాడెడి .............శేష
ఘోషణంబుల మంధానకుధరమధ్య
మానపాథోధి నాదంబు మాన మేదె. 62

ఉ. అంతట నమ్ముహూర్తమున నంగజసన్నిభముర్తులైన భూ
కాంతతనూభవుల్ సురభిగంధలతాంతవిభూషణాదులన్
వింతవిలాసముల్ పరిఢవింప నలంకృతులై మనంబులన్
సంతస మొప్ప నిల్చిరి లసన్మణికాంచనమంచవీథులన్. 63

వ. అంత నంతఃపురచారికాకృతపరిష్కార యగు భర్తృదారికాలలామంబు విందానుమతి(o)[1] జెలిమికత్తియ లిరువంకలం గదిసి యేతేర నిజా[ననా][2]oబురుహనిర్జితపూర్ణిమామృతాంశుబింబునుం బోని సితాతపత్రంబు నొరయ [దదీయ][3]సభారంగంబు ప్రవేశించె నప్పుడు. 67

క. దందడి వ్రాలె మహీధవ
నందనపై నపుడు ధరణీనాథుల చూడ్కుల్
మందారకమాలిక మీ
దం దిరమగు గండుతుమ్మెదల చందమునన్. 68

ఉ. ఆతఱి రాజమంచనివహాంచలవీథుల కేఁగుదెంచు న
బ్జాతదళాక్షిఁ బల్కె నటు చంద్రనిభానన దాదిపట్టి వి
జ్ఞాతసమస్తభూరమణజాతగుణాన్వయవేత్రదండముం
జేతఁ దెమల్చి మోపు జనసింధురవం బెడలించె వేడ్కతోన్. 70[4]



  1. వచనము సంక్షిప్తపఱుపఁబడినది
  2. ప్రా.పూరణము
  3. ప్రా.పూరణము
  4. 70వ పద్యము ప్ర.మ.భూ.లో 514 సంఖ్య గల పద్యము