పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ఆ చెలువ యిట్లు దృష్టికి
గోచరనై యంతికమునఁ గ్రుమ్మరు నన్నుం
జూచి కరం బచ్చెరుపడి
వాచామృత మొలుకఁ గొంతవడి కిట్లనియెన్. 80

మ. రమణీ యెవ్వతె వీవు పక్షితతికిన్ రారాని కన్యావరో
ధము నీ వేగతిఁ జొచ్చి వచ్చితివి తద్ద్వారంబు లుద్యత్కృపా
ణమహావీరభటాకులంబులు గదే నానాపగా వీచి వి
భ్రమహల్లీసకరంగశృంగమగు నీ ప్రాసాద మె ట్లెక్కితే. 81

క. కారణ మెయ్యెది యిచటికి
వారిజదళనేత్రి నీవు వచ్చుటకు మమున్
నీరూపదర్శనస్థితి
చే రమణీ ధన్యమతులఁ జేయుట దక్కన్. 82

ఆ. ఈ కృపాణవల్లి యేరాజు సవరించు
పాణిపంకజమునఁ బల్లవోష్ఠి
హర[1] కిరీట వాటి నసితాహియును బోలె
లలన నిన్ను నిది యలంకరించె. 84

క. అని పలికి యవ్విలాసిని
దనుజాంతక యూరకుండెఁ దత్సమయమునన్
మునుపలికి చెవుల కింపుగ
వెనుకఁ గళాసించి నట్టి వీణియపోలెన్. 89

క. ఈ రీతి వాక్సుధారస
పూరము దయసేసి తమకమునఁ గూరు సతిం
దేరకొనఁ జూచి చిత్తం

బారయ నిట్లంటి మంజులారవ ఫణితిన్. 90

  1. ప్రా.స.వ.-హరి-సా.ప.