పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. సీతాపతి కోపానల
భీతంబగు కోకయుగము మృదుకుచయుగళీ
కైతవమునఁ జేరిన ద
జ్జాతముఖిన్ సతతయోగ సంసిద్ధికినె. 22

ఉ. అన్నలినాయతాక్షి దరహాసలవంబుల సోయగంబుచేఁ
దన్నులఁ బడ్డ చింతబలె తామరసేక్షణ బోఁటికత్తె లొ
య్య న్నెరులంటి దువ్వు సమయంబునఁ దచ్చరణాంతికంబులం
బన్నుగ వచ్చివ్రాలు కుచభారముతోఁ బెడఁబాసి మల్లియల్. 44

చ. తనదు విరోధి యైన పురదానవఖండను చాపదండమున్
జనకుని వీట దాశరథి సత్వ మెలర్పఁగఁ ద్రుంచి వైచుటల్
విని రణధర్మవేది యగు వీరుఁడు మారుఁడు మేలు తానునుం
దన విలు గట్టి పెట్టె వనితాభ్రుకుటీ[1] కుటి కైతవంబునన్. 75

ఉ. ఇట్టిది దాని చక్కఁదన మెన్నఁగ శేషునకైన శక్యమే
యట్టి చకోరలోచన మురాంతక నీదయ గల్గునంతకున్
నెట్టన వేసవిం బడిన నిమ్నగవోలెఁ గళానివిష్టయై
గుట్టున మేను నిల్పుకొని కుందుచు నున్నది యేమిచెప్పుదున్.76

క. నత నిజ వదనామృతరు
క్ప్రతిబింబితమైన హృదయభాగముతో నా
రతిఁబోఁడి మతి హిమద్యుతి
సతతము గెల్పించు నీదు సమత[2] వహించున్. 78

ఉ. ఈ కృతినున్న[యా][3] కువలయేక్షణఁ దన్వి నృపాలకన్య రా
కాకుముదాప్తబింబముఖిఁ గన్నులపండువుగాఁగఁ జూచి ద
ర్వీకరతల్ప చేరఁజని వేగమ యమ్మునిదత్తశాంబరిం

బోకడ వెట్టచున్ విజనభూమి ననుం బొడచూపి నిల్చితిన్. 79

  1. ప్రా.స.వ.-రనితాభృకుటీ-సా.ప.
  2. ప్రా.స.వ.-నిమితసా.ప.
  3. ప్రా.పూర