పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. చూపిన నయ్యవంతినృపసూతి సురాసురకిన్నరావలికిన్
భూపకుమారవర్యుల నపూర్వవయోగుణరూపధన్యులం
జూపుల తీపులం గొసరఁ జూచి యొకానొకనిన్ నిజోల్లస
ద్రూపవిలాసలబ్ధి కనురూపముగాఁ గొనదయ్యె నాత్మలోన్. 18

ఆ. అవ్వధూటి నాఁటి కంతఃపురంబున
కనిచిపనిచి మఱియు నా నృపాల
వరుఁడు వ్రాసె జలధవలయితావనిలోన
గలుగు నృపులఁ జిత్రఫలకమునను. 21

క. విందుం డా ఫలకం బర
విందానన యైన మిత్రవిందకుఁ జూపెన్
డెందమున నా నృపాలక
నందనులను మెచ్చదయ్యె నందకుమారా. 22

క. కర్ణాకర్ణనములఁ జ[తు
ర][1]ర్ణోనిధి మధ్యభూతలాధిపు రెల్లం
దూర్ణమె యివ్వార్త న్వని
పూర్ణంబుగఁ జేసి రుల్లముల సిబ్బెతలన్. 24

సీ. అంతట నొక్కనాఁ డరవిందహితుఁ డబ్ధి
పూరంబు[నం బడఁబో][2]వుచుండ
బ్రహ్మాండమధ్యంబు బయలింత లేకుండఁ
బమ్మి చీఁకటి కారుకమ్మి నిండఁ
దమము నోలకుఁ ద్రోచి తలచూపి హిమరోచి
పూర్ణచంద్రిక నిట్టవొడిచి కాయ
వలపలి దెసనుంచి వచ్చి [చెం(గలువలు)][3]

కమ్మనెత్తావులఁ గ్రుమ్మరింప

  1. ప్రా.పూరణము
  2. ప్రా.పూరణము
  3. ప్రా.పూరణము [లెం ....] సా.ప.