పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. పుండరీకాక్షు లోచనాంభోరుహములఁ
దోఁచె రాగంబ జాగర దోషమునను
సతత[సంఫుల్ల][1]హల్లకచ్ఛదగుళుచ్ఛ
గర్భదళకాంతి విభవ సంక్రాంతిఁబోలె. 8

క. జలజాక్షుని [నేత్రంబులు][2]
గళదశ్రువిలోలపక్ష్మకములై పొలిచెం
గలకంఠి కడకు శీఘ్రమ
యెలమిం బోవంగ రెక్క లిడుకొనెడు[3] క్రియన్. 9

క. పీతాంబరునికి మాటికి
వాతెర వణఁకంగజొచ్చె వనజాతములం
జేతోనిలయస్థితి చెలి
కే తెమ్మ[ని][4] సన్నచేసి యెఱిఁగించు గతిన్. 10

తే. పరపుపై బోరగిల రేలు పవ్వళించి
కరసరోజంబు లల్లార్చుఁ గైటభారి
వెల్లి గొనివచ్చు విరహాబ్థి వెడల నీఁడ
నొయ్య[5] నభ్యాస మొనరింపు చున్నయిట్లు. 11

మ. వళదభ్యంతరవృత్తి వారిజముఖీవక్షోజసంఘట్టనం
బలె వక్షఃఫలకంబు మాటికిం జలింపం[6] జొచ్చె దైత్యారికిన్
గళదశ్రుప్రసరంబు తచ్ఛ్రవణసాంగత్యంబు పాటించి శ
య్యలపైఁ దన్మహిళాగుణేక్షణము [డా][7]యంబోవు చందంబునన్. 12

తే. ఆ కులాలక మాకంపితాధరంబు
నిస్సరద్బాష్ప[నిష్పంద][8]నేత్రపద్మ
మగుచు సంకల్పసురతకృత్యముల జరగె

యదు నృపాలున కయ్యిందువదనతోడ. 24

  1. ప్రా.పూరణము
  2. ప్రా.పూరణము
  3. ప్రా.సవ.—రెక్కలిడుకొని క్రియన్—సా.ప.
  4. ప్రా.పూరణము
  5. ప్రా.సవ.—నెయ్యఁ—సా.ప.
  6. ప్రా.సవ.—జెలిపం—సా.ప.
  7. ప్రా.పూరణము
  8. ప్రా.పూరణము