పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుడమికిం గెందమ్మి పూజ సేసినభంగి
లీలమై నొకకేల నేల నూఁది
తనివిగా వార్తామృతముఁ గ్రోలఁ బెట్టిన
పుడిసిలి క్రియఁ గర్ణపుటము నిచ్చి

తే. శంకతో స[న్నిధిని సఖీజనముఁ][1] బతియుఁ
జూచి యొండొరు మొగములు సూచికొనఁగ
నభినవంబైన భావోదయంబు సెప్పు

నాదరంబున సిరివరుం డాలకించె.

2



తే. అవ్విధంబున[2] నవధానమై మురారి
చిత్తగించుట యెఱిఁగి [యోజించి కదియ
వచ్చి][3] తన్వంగి[4] తానేక భంగి భణితి

విస్తరంబుగ నిట్లని విన్నవించె.

3



ఉ. కుండినపట్టణంబునను ఘో యనఁగానొక వార్త చెవులకుం(?)
బండువు సేయ వింటిమి తపస్విని రుక్మిణి వాసుదేవు [నిం
బెండిలియాడఁగా][5] నవనిఁ బ్రేమభరంబున పుష్పబాణుఁ డొ

క్కండు నెఱుంగఁ గంకణము గట్టిన దంచు వచింప నెల్లెడన్.

4



క. విని కర్ణోత్సవమును
గని నయనోత్సవము సేయఁగా భీష్మకు కొ
ల్వున రా[జు లెల్ల విడి][6]యుచు

మునుకొని పురిఁ గొన్ని దివసములు నిలువంగన్.

5



మ. బహుదేశంబులనుండి వచ్చు మగధుల్ పారప్రసంగంబులన్
మహనీయంబుగఁ జెప్పు నీదు యశమున్ మాధుర్యమున్ ధైర్యమున్
మహి[మంబుం జె][7]వి దేలఁ బెట్టి[8] వినుచుం దాదాత్మ్యముం బొందుఁ బ్ర

త్యహమున్ రుక్మిణి భీష్మకాంకమున నెయ్యంబార నాసీనయై.

6



  1. ప్రా పూరణము
  2. ఇవ్విధంబున
  3. ప్రా పూరణము
  4. మద్వంగి
  5. ప్రా పూరణము
  6. ప్రా పూరణము
  7. ప్రా పూరణము
  8. దెలంబెట్టి