Jump to content

పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అతిమదిరాంతరంగుఁడయి యీకృతవర్మయు నాత్మబంధులన్
హితులను మంత్రులన్ సుతుల నెల్లజనంబులఁ గూర్చి వారి సం
మతమున వత్సరాజునకు మానవతీజనరత్నమున్ మృగా
వతియును నిచ్చువాఁ డగుచు వచ్చినవారిని బెండ్లిపెద్దలన్.

204


వ.

బహుమానపురస్సరంబుగా వీడ్కొలిపి తాను వివాహంబునకుఁ దగిన
కర్తవ్యంబు ప్రవర్తింపుచుండె నక్కడ వత్సాధీశ్వరుండును సఫలమంత్రి
యుతంబుగా వివాహంబునకుం దగిని సన్నాహంబులు సమకట్టి సకల
బంధుగణంబుతో .... మెఱసి వెడలి దినదినప్రయాణంబులం
జనుదెంచి—

205


సీ.

........యింపిలోఁ గప్పు
                రంబునఁ దీర్చిన రంగవల్లి
(క)లతోడఁ గుంకుమ తలకిన పట్టాస
                వలువతో రాజమార్గంబులనడుమఁ
............గలతోడు హర్మ్యసి
                మలయంబు ధూపధూమముల కమ్మఁ
దాపుల.....హారతలములఁ గైసేసి
                వరలుపౌరాంగనావలులతోడ


తే.

బహుళవెససమాగతబంధురాజ
బృందములతోడ దిక్కులు పిక్కటిల్ల
వివిధపంచమ(హా)వాద్యరవముతోడ
బోరుకలిగెడు సాకేతపురవరంబు.

206


వ.

ప్రవేశించి యారాజనందనుండు పౌరజనదృక్చకోరచంద్రబింబా
యమానవదనారవిందుండై రాజమార్గంబున నగరి కేతెంచి శుభ
లగ్నంబున—

207