అని పలికి యజ్జలజవదన లజ్ఞావనతవదనయై యూరకుండె నచ్చెలి
కత్తెయుం జిఱునవ్వు చిగురొత్తఁ దనవెయ్యంపుంజూడ్కి రాజనందన
ముఖారవిందంబున నొలయింపుచుఁ జంటలాక్షి యఘటనాఘటనచాతు
రీధురీణనగు నేఁ గలుగంగఁ దమ పనుల కేమి విచారంబు తుదమొద లేర్ప
ఱుపరాని భవన్మనోరథార్థసిద్ధికై యిట్లు చతుస్సముద్రముద్రితంబగు
మహీమండలంబునంగల మహనీయవిలాసవిభ్రమైకభాజనులగు రాజ
కుమారులం జిత్రపటంబునం జిత్రలేఖనాపాటవం బేర్పడ నిర్మించి
దానిలో నిజమనోవల్లభు నేర్పఱించిన నాకు నారాజకుమారు నిచ్చటికిం
దెచ్చుట యేమి యచ్చెరు వీక్షణంబ యీవృత్తాంతంబంతయు
భవజ్ఞననీజనకుల కెఱింగించి యమ్మహామహీపాలు నిచ్చటికి రప్పింతు
నొండురెండుదినంబులు నీయుల్లంబున ధైర్యం బవలంబించి యుండు
మని చెప్పె యప్పుడు కొందఱు సఖీజనంబులతో నమ్మహీపాలుపాలికిం జని
యేతద్వృత్తాంతం బాదిమధ్యాంతంబుగా నమ్మహీకాంతున కెఱింగించిన
నతండును నిజతనూజ నీయందు బద్ధానురాగయగుటకు మనంబున
మిగుల ననురాగంబు నొంది నిఖిలసామంతసీమంతినీహితపురోహితా
మాత్యానుమతి మృగావతి నిచ్చువాఁడై నిశ్చయంబుతో వివాహంబునకు
సంభ్రమింపుచున్నవాఁ డీసంతోషవార్త ముందఱ నీ కెఱింగించువాఁడనై
వచ్చితి ననియును బ్రథమంబున నీకు నమ్మృగావతికిఁ దాన[1] యనురా
గంబు దలిర్ప నీచిత్తం బమ్మత్తకాశినియం దత్తుకొల్పిన పురందరుండు
భవచ్చిత్రరూపంబు నిజదూతచేతం గలలోన నక్కలకంఠికిం గానుపించి
యయ్యిందుముఖి డెందంబు నీయందుం దగులుకొలిపె[2] ననియుం జెప్పి
నారదుం డతనిచే నిమంత్రితుండై గగనమార్గంబునకుం జనియె
నాసమయంబున యుగంధరుండు నగరి కేతేంచి సముచితప్రకారంబువ
సమ్ముఖంబై తదనుమతి నుచితాసనంబునం గూరుచుండి విన్ననై
(యున్న) యన్నరనాథునాననం బవలోకించి—