పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ధరణిం గలుగుట యెఱుఁగరు
నరపర్ణిని యిప్పురంబువారు తమంబుల్
పురబహిరుపవనమధ్య
స్థిరహరజూటీ శశాంకదీప్తులచేతన్. 154

మ. తరుణీ ధర్మగుణానుయుక్తమగు నే తత్సాయకం బుగ్రతం
బరభూపాలకపాలపాటనవిధిం బాటించుటన్ చిత్రమౌ
నరనాథాత్మజ వీనిదొరసి కృపాణఖ్యాతి బ్రాపించియుం
గరిమం ద్రుంచుఁ బరావరోధమహిళాకళ్యాణసూత్రావళుల్. 155

ఉ. లోలతరాక్షి వీఁడు కలలోపల నీకనుఁగొన్న పుణ్యసం
శీలుఁడ యేని నీరతుల చెమ్మటలారఁగ నల్ల వీఁచు శీ
ప్రాలలితాంతికోపవనపాదుపకుంజకుటీరవీరుఁ డు
న్మీలితపుష్పసౌరభసమేతవినూతనవాతపోతముల్. 156

మ. శతపత్రోపమనేత్ర నీఁడు మగధక్ష్మామండలాఖండలుం
డితనిం జూడుము ఱెప్పలెత్తి ప్రమదం బింపొంద డెందంబులో
శతశోవ్యక్షితినాథు లున్న నిల రాజద్రాజబింబాస్య యీ
రతిరాజాకృతిచేత నందుఁ నెపుడున్ రాజన్వతీనామమున్. 157

క. సుగుణాశ్రయుఁ డితఁ డేలఁగ
మగదక్ష్మామండలంబు మానిని భూలో
కగతంబగు నాకంబనఁ
బొగ డొందుఁ బ్రసిద్ధభూరిభోగాస్పదమై. 158

మ. హరిణీశాబవిశాలలోచిన యితం డంభోధివేలామహీ
సరిఘాతీరము మేరగా ధరణి దోఃప్రౌఢిం బ్రశాసించు ది
క్కరు లుత్సాహమునన్ మదాతిశయముం గైకొల్పఁ జెక్కిళ్లపై
నెరవెట్టన్ సుఖనిద్రఁ జెందు ఫణిరా జిచ్ఛానురూపంబుగన్. 159

క. వనజాక్షి వీఁడు నీకలఁ
గనిన ఘనుండేఁ బ్రదోష[1]కాలముల విలో
కనవరులను పుష్పపురాం
గనలకుఁ గావించు నేత్రకౌతూహలమున్. 160

  1. సా.ప.-ప్రవేశ-తా.వ్రా.ప