Jump to content

పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

మదగజయాన చూడు మనుమానము సేయక రెప్పలెల్ల లో
నొదవినవేడ్క నీత్రిదశయోధుల నందఱి వీరిలోన నీ
మది కనురూపమైన గుణమానితుం డుండుం బోని వాని న
భ్యుదయము నొందు నిత్యము సముజ్జ్వలమన్మథరాజ్యసంపదన్.

141


మ.

పవనం....
భువనం బాశ్రయభూమి యౌఁదలఁమోల్పుల్[1]....
ధ్రువచక్షుశ్శ్రవణేంద్రనందనుం.....
న్గవమించుల్ బులకింపంజాలు లీవె రాకారజబింబాననా.

142


క.

నీకన్నానిన పురుషుం
డోకమలాయతాక్షి యురగాన్వయ ల
క్ష్మీకరుఁ డగునేనిఁ దగం
గైకొనుఁబో యీతఁ డింతి ఘనభోగేశున్.

143


మ.

ప్రథమాస్తాచలసేతుశైలమహీభృత్ పర్యంతభూపాలురం
బ్రథనక్ష్మాజయశీలురన్ దినకరప్రాలేయరుగ్వంద్వలం
బృథుతేజోధనుల న్నిలింపదరణిబృద్ధైర్యులన్ యీమ
న్మథులం జూడుము భవ్యులం దరుణి నాకాదేశవాస్తవ్యులన్.

144


ఉ.

నేరెడుదీవియేల .......లందఱు......
భోరుహనేత్ర యీసుగుణభూషణులం గొనియాడఁగా
వీరి విలాససంపదలు వీరిభుజాబలవిక్రమస్థితుల్
పారము ముట్టగాఁ బొగడ భారతికైనను నేరఁబోలునే.

145


మ.

హరిణలోచన చూడు వీరి భవదీయాలోకశ్రీలు త
చ్చరణాగ్రంబుల నుత్పలాంజలుల[2]తేజం బొంద నాభీసరో
వరమధ్యంబునఁ జంచరీకముల ఠేవె బ్రోవఁ గంఠంబులం
బురుహూతోపలహారవల్లరుల చొప్పుల్ చెప్ప నెయ్యంబునన్[3].

146
  1. యౌఁదలచిమోఁపుల్
  2. నుత్పతాంజలుల
  3. చొప్పుల్ చెప్పు నెయ్యంబునన్