పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. తనివోవ నినుఁ జూచుతటి వాని కిభయాన
యనిమిషత్వము నైజ మందకున్నె
జలజాక్షి నీమోనిచవు లానుచో వాని
కరువిఁ జేయకయున్నె యమృతరసము
నిదురఁబాయుట వేడ్కనిగుందె వానికి
లేరు నిన్ గేళిఁ దేలించునపుడు
రతుల నిష్టార్థముల్ రమణి వీ వొసఁగుచోఁ
గాంక్షించునే వాఁడు కల్పలతిక
తే. ఇందుబింబాస్య వీరిలో నెవ్వఁడైన
నీదు కలఁగన్నధన్యుఁ డుండిన లతాంగి
వీరి వీక్షింపు ముఖ్యబృందారకులను
లలితలావణ్యరేఖావిలాసయుతుల. 133

శా. నాళీకానన నీఁదు దెంతతికిన్ నాదు....వోశ్శక్తిచేఁ
బాలించుం ద్రిదివంబుఁ బోర గెలిచెం బాకాదిదైత్యాది ది
క్పాలశ్రేణికి ముఖ్యుఁ డింద్రుండు నినుం బాటించుఁ గెంగేల నీ
వాలుంగన్నులఁ గాంక్షదీర నితనిన్ వామాక్షి వీక్షించవే. 134

సీ. మేనక నెమ్మోవిమీఁదఁ జేర్చినముద్ర
ముదిత నీకసిగాట్ల మాయనొత్తి
హరిణి సందిటనిడ్డ హరిణాంకశకలంబు
బాల నీకొనగోరఁ బాయనొత్తి
నిండుఁగౌఁగిట రంభ నెలకొల్పు మరులొల్తు
లతివ నీచనుదోయి నదిమిపుచ్చి
రతులఁ గైకొల్పు నూర్వశిమేని మైపూఁత
తరుణి నీచెమటచిత్తడి దొలంచి
తే. కేళి నోలార్పుమీ యింద్రుఁ గీరవాణి
వీఁడె నీకలలోఁ జూచు భ్రమాభి
రామ రమణీయరేఖావిరాజమాన
హావభావాతిశయమూరి యయ్యెనేని. 135